తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కార్యక్రమంలో హాట్ యాంగర్ గా అందరి మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న అనసూయ కొంత కాలానికి ఆ షోకి గుడ్ బై చెప్పింది. తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో, ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తుంది. కొన్ని టీవీ షోల్లో యాంకర్ గా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం యాంకరింగ్ చేస్తున్న అనసూయకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. హీరోయిన్లే ఆశ్చర్యపోయే పాపులారిటీ అనసూయం సొంతం చేసుకుంది..గతంలో ఈ అమ్మడిని పవన్ కళ్యాన్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని కోరగా సున్నితంగా తిరస్కరించింది. ఒకవేళ ఐటమ్ సాంగ్ ఫిక్స్ అయితే భవిష్యత్ లో మంచి పాత్రలు మిస్ అవుతాని అప్పుడే ఊహించిన ఈ అమ్మడు చాలా సెలెక్టీవ్ గా సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతుంది. 


అయితే ఈ అమ్మడు ఇప్పుడు బుల్లితెరపై కాకుండా వెండితెరపై వెలిగిపోవాలని కలలు కంటుంది అయితే ఆ కలలు కూడా నిజమౌతున్నాయి. గతంలో సినిమాల్లో చిన్నా చితకా వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. అక్కినేని నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో కీలక రోల్ పోషించిందట. తాజాగా అడివి శేషు, ఆదా శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న క్షణం చిత్రంలో ఈమె కీలకమైన రోల్ పోషిస్తోందని టాక్. సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న దర్శకుడు రవికాంత్ ఈ సినిమా తీస్తున్నారు.


‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నాగార్జున, అనసూయ


మొత్తానికి సినిమాలో తన ప్రతాపాన్ని చూపించుకోవడానికి ఈ హాట్ యాంకర్ ప్రయత్నాలు వృదా పోకుండా ఒక్కో చాన్సులు వస్తున్నాయి. అంతే కాదు గతంలో అనసూయ యాంకరింగ్ చేసిన జబర్ధస్త్ ప్రోగ్రామ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా మంచి హిట్ సాధిస్తే  మంచి నటిగా గుర్తింపు వస్తుంది ఆశాభావం వ్యక్తం చేస్తుంది యాంకర్ అనసూయ. ఇప్పటికే క్షణం ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: