ఈ మద్య అజిత్ నటించిన ‘వేదలం’ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు..దీపావళి కి విడుదలైన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగిస్తుంది. వారానికే దాదాపు 50 కోట్లు వసూళ్లు చేసి.. వంద కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమాలో అజిత్ తో సమానంగా చెల్లెలి పాత్రలో నటించిన  లక్ష్మీమీనన్ కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పేరు ఈ అమ్మడి కొంప ముంచేలా ఉందని వాపోతుంది. వాస్తవానికి మళియాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా.. తమిళంలో మంచి పేరు సంపాదించింది.

ఇప్పటికే విక్రమ్ ప్రభు, విశాల్, కార్తీ, సిద్దార్థ్ వంటి హీరోల నటించి మంచి క్రేజ్ సంపాదించింది. విశాల్ తో నటించిన ఇంద్రుడు సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది.  తమిళ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిందని అందరూ అంటున్నారు. . రీసెంట్‌గా అజిత్ ‘వేదాలం’లోనూ ముఖ్య పాత్రలో నటించింది..ఈ చిత్రం విజయంతో లక్ష్మీమీనన్ మంచి ఆఫర్లు వస్తున్నాయి.. అయితే సంతోషించాల్సి విషయమే కాదా ఎందుకు బాదా అనుకుంటున్నారా..? ఇక్కడే ఈ అమ్మడికి దిమ్మతిరిగిపోయే షాక్ గురైంది.

వేదలం చిత్రంలో అజిత్, లక్ష్మీమీనన్


అజిత్ కి చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించిందంటూ ప్రశంసలు లభించడంతో.. వరుసగా సిస్టర్ ఆఫర్స్ తలుపు తడుతున్నాయట. ఇప్పటికే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీమీనన్ హటాత్తుగా చెల్లెలు పాత్రలు రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏదో స్టార్ హీరో సినిమా కనుక చెల్లెలి పాత్రకు ఓకే చెప్పాను కానీ.. ఇకపై అలాంటి అస్సలు చేయనంటోంది.  భవిష్యత్ లో అజిత్ లాంటి హీరోలతో అలాంటి పాత్రలు చేయాల్సి వచ్చినా నో అని చేబుతానంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: