ఇంత దాన్ని పదింతలు చేసి చెప్పడం మీడియాకు వెన్నతో పెట్టిన విద్య.. అసలు మ్యాటర్ జరిగేది చీమంత అయితే దాన్ని అన్ని కోణాలనుండి కెళికి మరి ఏనుగంత చేస్తారు మీడియా వారు తప్పదు అది వృత్తి ధర్మం. అయితే ఇదే చొరవ సినిమా వాళ్ల దగ్గరకు వస్తే ఇంకాస్త ఎక్కువవ్వుతుంది. ఫిల్మ్ నగర్లో చిన్న మ్యాటర్ దొరికితే చాలు దాన్ని ఉతికి ఆరేస్తారు మీడియా వారు. ప్రస్తుతం హీరోలు చేస్తున్న సినిమాల దగ్గర నుండి చేయబోయే సినిమాల దాకా.. ఎలాగైనా ఎక్కడినుండైనా ఎలాంటి వార్తనైనా చక చకా రాసేస్తారు. అయితే ఈ చొరవలో అసలు విషయం అనేది మాత్రం ఏమీ ఉండదు అనేది సత్యం.


ఇంతకీ మ్యాటర్ ఏంటంటే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అంటే ఓ స్పెషల్ క్రేజ్.. నందమూరి అభిమానులే కాదు సినిమాను ప్రేమించే వారు కూడా ఎన్.టి.ఆర్ పండించే ఎమోషన్ కి ఫిదా అయిపోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో.. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ చేసి తర్వాత కొరటాల శివ సినిమా చేస్తాడు ఎన్.టి.ఆర్. అయితే ఈ మధ్యలో మీడియా కాస్త చొరవ తీసుకుని ఎన్.టి.ఆర్ కత్తి రీమేక్ చేస్తున్నాడని హడావిడి చేశారు.


కత్తి సినిమా చూసి బాగుంది అన్న పాపానికి ఎన్.టి.ఆర్ ఆ సినిమా చేస్తున్నాడనే రూమర్ లేపారు. అది సర్ధుమనిగింది కదా అనుకున్న టైంలో రీసెంట్ గా అజిత్ తీసి హిట్ కొట్టిన వేదలం సినిమా కూడా ఎన్.టి.ఆర్ మెచ్చాడని ఆ సినిమా తప్పకుండా తెలుగులో ఎన్.టి.ఆర్ తీస్తాడని తెగా ఉత్సాహంగా వార్తలు రాసింది మీడియా. అయితే ఎన్.టి.ఆర్ వేదలం చూసి మెచ్చిన మాట వాస్తవమే అయినా ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్న సందర్భంలో ఆ సినిమాలేవి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.


కాని మీడియా మాత్రం అజిత్ సినిమాను తప్పకుండా ఎన్.టి.ఆర్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడని నానా రచ్చ చేయడం మొదలెట్టారు. అయితే దీనికి వివరణ ఇచ్చుకుంటూ తన సన్నిహితులలో ఒకడికి ఎన్.టి.ఆర్ తాను కత్తిని, వేదలం సినిమాలను చేసేది లేదని చెప్పాడట. ఈ న్యూస్ బయటకు వచ్చి రాగానే ఎన్.టి.ఆర్ మీడియాకు గట్టి పంచ్ ఇచ్చాడనే అంటున్నారు. మరి చొరవ చూపించినా ఒక్కోసారి ఇలా దెబ్బైపోతాం బాసు అని వారికి వారే జోకులేసుకుంటున్నారు. మొత్తానికి మీడియాకు ఎన్.టి.ఆర్ షాక్ ఎప్పటికి మర్చిపోలేనిదని విలవిల లాడుతున్నారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: