తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేశారు. అంతే కాదు ఈయన నీడలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది జీవనోపాది పొందారు. అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మి ల వివాహంతో.. అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు వియ్యంకులు అయ్యారు. వీరికి పుట్టిన బాబు నాగచైతన్యం. కొంత కాలానికి నాగార్జున, లక్ష్మిలు విడాకులు తీసుకున్నారు.



అప్పటి నుంచి నాగచైతన్య తాత రామానాయుడి వద్ద పెరిగాడు. ఇక రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్ తనయుడు రానా.  చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరగడం వల్ల రానా, చైతూ ఇద్దరు మంచి స్నేహబంధంతో మెలిగారు. ఇక ఇద్దరు మనవళ్లు అంటే తాతయ్యకు మరీ ముద్దు.. ఆ ఇద్దరు తాతయ్య వడిలో ఆడుకుంటున్న చిత్రం మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: