రాజ్ తరుణ్.. ఇప్పుడు యువత నోటి వెంట వచ్చే సరికొత్త హీరో పేరు.. అసలు ఎక్కడినుండి వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు కాని కేవలం నటించిన మూడు సినిమాలకే తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. సినిమాలు చేయదానికి ముందు వైజాగ్ ఎం.ఆర్ ప్రొడక్షన్స్ వారు తీసీన్ పలు షార్ట్ ఫిలింస్ లో నటించిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. బావా మరదళ్ల సరసాలతో సమ్మర్ కూల్ హిట్ సాధించింది ఉయ్యాల జంపాల సినిమా.


ఆ సినిమా హిట్ వచ్చింది కదా అని వెంటనే సినిమా చేయకుండా ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్లీ రెండో సినిమా నక్కిన త్రినాధరావు డైరక్షన్లో 'సినిమా చూపిస్త మావ' అంటూ వచ్చి నిజంగానే మాస్ ఆడియెన్ కి మంచి ఫీస్ట్ లాంటి సినిమా చూపించి హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీదున్న రాజ్ తరుణ్ ఫాంని మరింత కొనసాగించేలా సుకుమార్ సినిమా ఆఫర్ రావడం. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అవ్వడం జరిగాయి. అసలు సినిమాల్లో హీరోగా ఒక్క సినిమా హిట్ అయ్యి ప్రేక్షకాదరణ పొందాలంటే నా నా తంటాలు పడుతున్న ఈ టైంలో ఇలా వచ్చి అలా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు రాజ్ తరుణ్.


కుమారి 21ఎఫ్ సినిమాలో పాత్రం పరిధి మేరకు సినిమాకు కావాల్సిననత అవుట్ పుట్ ఇచ్చి సినిమా సక్సెస్ కు కారణమయ్యాడు రాజ్ తరుణ్. ఓ పక్క సినిమా మొత్తం కుమారి హీరోయిన్ హెబ్బా హాట్ అండ్ స్వీట్ కలగలిపి జోడించి ప్రేక్షకులను అలరిస్తే.. తన సింపుల్ యాక్టింగ్ తో అందరిని ఆశ్చర్య పరిచాడు రాజ్. సినిమా సక్సెస్ ని వర్మ చేత పొగిడించుకునేలా చేశాడంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ప్రస్తుతం రాజ్ కెరియర్ సూపర్ ఫాంలో ఉంది. ప్రస్తుతం కుమారి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రాజ్ ప్రస్తుతం మళ్లీ రెండు మూడు సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు.


టాలెంట్ ఉంటే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేదు అని మరోసారి ప్రూవ్ చేశాడు రాజ్ తరుణ్. మరి మొత్తానికి సినిమాలైతే సక్సెస్ సాధిస్తూ స్టార్ హీరోలకు కంట్లో నలుసులా ఉన్న రాజ్ కెరియర్ ఇలానే కొనసాగాలంటే కాస్త ఇదే పట్టుని కొంతకాలం మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోద్ది. అసలే ముందు మంచిగా నటించి తర్వాత ఇమేజ్ డ్యామేజ్ చేసే షకలు గల వ్యక్తులు చాలామంది పరిశ్రమలో ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: