పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ వేగం పెంచడంతో ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోని వర్కింగ్  స్టిల్స్ ఒకొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ ఈసినిమాకు సంబంధించి గుజరాత్ రాష్ట్రంలోని వదోదరా ప్రాంతంలో భారీ షెడ్యూల్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్ తో ‘సర్దార్’ షూటింగ్ స్పాట్ లో ఫోటో తీయిoచుకున్న  ఈ కూతురు ఎవరు ? అంటూ పవన్ అభిమానులు ఈ ఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం వెబ్ మీడియాకు ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ గుజరాత్ లో జరుగుతున్నా చాలామంది గుజరాతీలు ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రాంతం వారు షూటింగ్ స్పాట్ లో ఉన్న పవన్ ను కలవడానికి ఉత్సాహం చూపెట్టడమే కాకుండా పవన్ తో ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటు హడావిడి చేస్తున్నారు.

షూటింగ్ స్పాట్ కు వస్తున్న ఎంతోమంది అభిమానులను పవన్ నవ్వుతూ పలకరించడమే కాకుండా వారితో ఫోటోలు కూడ తీయించుకుంటూ ఉండటంతో పవన్ లో బాగా సహనం పెరిగింది అని ‘సర్దార్’ యూనిట్ సభ్యులు కామెంట్ చేస్తున్నట్లు టాక్. ఎప్పుడూ లేనివిధంగా ఈసినిమాలో పవన్ పక్కన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తూ ఉండటంతో పవన్ కూడ కమర్షియల్ ట్రిక్స్ ఫాలో అవుతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సమ్మర్ రేస్ కు రెడీ అవుతున్న ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని సంకేతాలు వస్తున్న నేపధ్యంలో ఇదే సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తున్న మహేష్ ‘బ్రహ్మోత్సవం’ అల్లుఅర్జున్ ‘సరైనోడు’ సినిమాల నిర్మాతలకు పవన్ ‘సర్దార్’ కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని అని టాక్. ఇంతకీ పవన్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలియక పోయినా ప్రస్తుతానికి ఈ న్యూస్ హాట్ టాపిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: