‘దేనికైనా రెడీ’తో చాలా రోజుల తరువాత హిట్ కొట్టింది హన్సిక. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. త్వరలో సూర్య సరసన యముడు 2లో నటిస్తోంది. అంతకుముందు వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్రని కూడా ఆ మధ్య వేయించుకుంది. అయితే, సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న రోజుల్లో మీ మానసిక పరిస్థితి ఏంటి అని ఇటీవల ఓ సందర్భంలో ఆమెని అడిగితే... ‘ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడూ అలానే ఉన్నాను. నిజం, ఎందుకంటే ఒక సినిమా కథ విని బాగుందని నిర్ణయించుకున్నాకనే నటించడానకి ఓకే చెబుతాను. ఆ తరువాత సినిమా ఫెయిలయితే దానికి ఫలానా వారి వల్లే సినిమా ఫ్లాప్ అయిందీ... నా వరకూ నా పాత్రకి న్యాయం చేశాను అని తప్పించేసుకోను. నా కష్టమేదో నేనే పడతాను తరువాత ఫలితం దేవుడికి వదిలేస్తాను. ఆ మధ్య వరుస ఫ్లాపులు వస్తున్నప్పుడు వచ్చిన కామెంట్లన్నీ నాకు తెలుసు. కానీ నేను స్పందిచలేదు. ఎందుకంటే నేను పడిన కష్టం ఒక రోజు కాకపోయినా మరొక రోజైనా కలిసి వస్తుంది కాబట్టి’ అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: