వరుస మూవీలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరో నిఖిల్. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో నటించిన మరో చిత్రం ‘శంకరాభరణం’ త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే నిఖిల్ కి వరుస మూవీలు సక్సెస్ లు పడటంతో...ఈ హీరో రేంజ్ మారిపోయింది. ఇప్పటి వరకూ కొత్త హీరోయిన్స్, చిన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన నిఖిల్...ఇక నుండి సీనియర్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు.


ఇక శంకరాభరణం మూవీ డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ లోపే తన నెక్ట్స్ సినిమాని లాంచ్ చేసి, సెట్స్ పైకి పరుగులు పెట్టిస్తున్నాడు. తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘టైగర్’ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకున్న ఆనంద్ ఈ సినిమాకి డైరెక్టర్.  ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు. మెయిన్ హీరోయిన్ గా తాప్సీ ని ఫైనలైజ్ చేశారు. తాప్సీ ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలతో రొమాన్స్ చేసింది.


ఓ రకంగా తాప్సీ ని సీనియర్ హీరోయిన్ గానూ, ముదురు హీరోయిన్ గానూ చెప్పుకుంటారు. తాప్సీ నటించిన పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద ప్లాప్ లు కావటంతో...ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే కోలీవుడ్ లో పాగా వేస్తుంది. ఇక నిఖిల్ తన రేంజ్ ని పెంచుకోవటంతో...టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయటానకి ఇష్టపడుతున్నాడు. అందులోని భాగంగానే తాప్సీతో రొమాన్స్ చేయబోతున్నాడు.


అయితే తాప్సీ, నిఖిల్ సరసన ఎక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్ గా కనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఇక మిగతా హీరోయిన్స్ వివరాల్లోకి వెళితే, ఉయ్యాలా జంపాలా ఫేం అవిక గోర్, అలాగే కలర్స్ స్వాతిని సెలక్ట్ చేస్తున్నట్టగా తెలుస్తుంది. డిసెంబర్ 2వ వారం నుంచి  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: