అక్కినేని వంశం నుండి ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలో దమ్మురేపనున్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇలా ఈ ముగ్గురు హీరోలు...బాక్సాపీస్ వద్ద సత్తా చాటనున్నారు. అయిత గత కొంత కాలంగా నాగార్జున సినిమాలు ప్లాప్ అవుతుంటే, నాగచైతన్య సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి.  ఆ తరువాత కొంత కాలానికి నాగచైతన్య మూవీలు ప్లాప్ అవుతుంటే, ఇప్పుడు నాగార్జున సినిమాలు సక్సెస్ లు అవుతున్నాయి.


అయితే ఎప్పుడూ వీరి ఇద్దరూ ఒకే సమయంలో స్వింగ్ లో లేరు. ఇక తాజాగా అఖిల్ సైతం తన మొదటి మూవీతోనే డిజాస్టర్ ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఫాంలో ఉన్న నాగార్జున...ఇద్దరి కొడుకుల ఫిల్మ్ కెరీర్ ని ఓ పద్దతిలో పెట్టేందుకు రంగం  సిద్ధం చేశాడు. ఇప్పటివరకూ కుమారుల సినిమాల కథల విషయంలో వేలు పెట్టని నాగ్, ఇకపై వారి కథల ఎంపికలో తన అనుభవంతో సూచనలు చేయనున్నాడు.


అంతే కాకుండా కొత్త దర్శకులకి వరుస అకాశాలు ఇవ్వనున్నాడు. కథ మంచిగా ఉంటే కొత్త దర్శకుడైనా కొడుకు మూవీలకి ఇకనుండి గ్రీన్ సిగ్నల్ దొరకనుంది. ప్రత్యేకంగా అఖిల్, నాగచైతన్య మూవీలకి సంబంధించిన కథ అప్రూవల్ కావాలంటే, ముందుగా నాగార్జునని సంప్రదించవలసిందే. నాగార్జున ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు.


ఆ రెండు చిత్రాలు మంచి పాజిటివ్ టాక్స్ తో షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. కళ్ళ ముందు కొడుకుల మూవీలు ప్లాప్ అవుతుంటే చూడలేక, ఇక నుండి వారి కెరీర్ ని గాడిలో పెట్టేందుకు నాగార్జున  తన వంతు ప్రయత్నాలను చేపట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: