సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఏదైనా మూవీకి ఆఫర్ ని చేజిక్కించుకోవాలంటే, హీరోయిన్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇంత ఠఫ్ కాంపిటీషన్ లో తన దగ్గరకు వచ్చిన ఓ ఆఫర్ ని స్టార్ హీరోయిన్ తమన్న తిప్పి పంపింది. ఆ ఎఫర్ ఎలా వచ్చింది? ఎందుకు తిప్పి పంపింది? చివరకు ఆ ఆఫర్ ఎవరిని వరించింది? వంటి వివరాలు ఇప్పడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ మారింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ని లీడ్ చేస్తున్న వాళ్ళల్లో తమన్న ఒకరు. అలాగే సమంత సైతం టాప్ హీరోయిన్ గా కెరీర్ ని లీడ్ చేస్తుంది. తాజాగా తమన్నకి వద్దకు విజయ్ నటిస్తున్న మూవీ ఆపర్ వచ్చింది. ఇందులో తమన్న ఓ బిడ్డకు తల్లిగా నటించాలంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. దీంతో తమన్న ఏ మాత్రం ఆలోచించకుండా కథలో మార్పులు చేస్తే నటిస్తాను, లేకుంటే నటించను అంటూ చెప్పుకొచ్చింది.


ఇక కథని మార్చటం ఇష్టం లేక, దర్శకుడు సమంతని అప్రోచ్ అయ్యాడు. ఇంకేముంది సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ బ్యూటీ విక్రమ్ తో కలిసి నటించిన సినిమా బాక్సాపీస్ వద్ద సక్సెస్ టాక్ ని సొంతం చేసుకోవటమే కాకుండా, కోలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకే దర్శకుడు అట్లీ చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అట్లీ, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో సమంత డ్యూయల్ రోల్ చేయనుంది.


ఇందులో ఓ పాత్రలో సమంతా ఒక బిడ్డకు తల్లిగా కనిపించనుందని అంటున్నారు. తమన్న చేయాల్సిన ఈ ఆఫర్ ఇప్పుడు సమంత చేస్తుండంతో...ఈ కాంబినేషన్ పై మార్కెట్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ చేరుకున్నాయి. ఈ సినిమాలో సమంతా కూతురుగా,మీనా కూతురు 'నైనిక' తొలిసారిగా వెండితెరపై కనిపించనుంది. 'పులి' పరాజయం తరువాత వస్తున్న సినిమా కావటంతో, మూవీకి సంబంధించిన స్టార్ కాస్టింగ్ పై విజయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: