సూపర్ స్టార్ మహేష్ కొద్దిరోజులుగా మీడియాతో మంచి సన్నిహితంగా ఉంటున్నారు మరి అలాంటి మహేష్ ని ఎందుకు టార్గెట్ చేస్తారని మీరు డౌట్ పడొచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న సోషల్ మీడియా మహేష్ సినిమాపై నానా రకాలుగా హంగామా చేయడం మొదలెట్టారు. అందుకే దీనికి మహేష్ కూడా కౌంటర్ ఎటాక్ ఇచ్చాడని అంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ గురించే ఈ లొల్లి అంతా..


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పనితనం మెచ్చి మరోసారి తనకు చాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో నిర్మితమవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ కు మరో మంచి హిట్ ఇస్తుందనే భావనలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఏమైందో ఏమోగాని మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్ ఆగిపోయిందని.. మహేష్ కు సినిమా మధ్యలో శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నచ్చలేదని ఏవేవో పుట్టికొచ్చాయి రూమర్లు.


మహేష్ మళ్లీ కథ మార్చాలని అన్నాడని.. అలా చేస్తేనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని గట్టిగానే గాసిప్పులు రాసేశారు. విషయం ఆ నోటా ఈ నోటా పడి మహేష్ చెవిన పడేసరికి సినిమా పీ.ఆర్ లను పిలిచి గట్టి షంటింగ్ లు ఇచ్చాడట. సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి గాసిప్పులు రాస్తున్నారని వారికి క్లాస్ పీకాడట మహేష్. ఇక నుండి అప్డేట్స్ విషయంలో అసలు మిస్ అవ్వకుండా జాగ్రత్తపడాలని సూచించాడట. సినిమా సజావుగానే సాగుతుందని ఎటువంటి ఆటంకాలు జరుగలేదని విషయాన్ని ముందు ఎనౌన్స్ చేయమని చెప్పాడట. 


మహేష్ పీకిన క్లాస్ కు రియలైజ్ అయిన సినిమా పీ.ఆర్ టీం సినిమా షూటింగ్ అప్డేట్స్ ని అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం షూటింగ్ నిమ్మిత్తం ఊటీ వెళ్లాల్సిన బ్రహ్మోత్సవం టీం ఇంకా హైదరాబాద్లోనే ఉంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మీద మహేష్ గుస్సుగా ఉన్నాడనేది మ్యాటర్. మరి సినిమా అప్డేట్స్ తెలియకుండా ఉండేలా చేసినందుకు గట్టి దెబ్బే పడ్డది. మహేష్ సినిమా అప్డేట్స్ తెలుసుకోవాలని ఉత్సాహపడే ఫ్యాన్స్ కోసం సోషల్ సైట్స్ లో సెర్చ్ చేసే ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో మ్యాటర్ ఏం లీకవ్వకపోయే సరికి సినిమా ఆగిపోయిందని ప్రచారం చేయడం మొదలెట్టారు. మొత్తానికి అలాంటిదేమీ లేదు బ్రహ్మోత్సవం షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నాయన్నది సరికొత్త అప్డేట్..


మరింత సమాచారం తెలుసుకోండి: