రాజమౌళి ఒక సినిమా గురించి మంచి కామెంట్ చేస్తే ఆ సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయి ఆ సినిమా బిజినెస్ ను కూడ ప్రభావితం చేస్తున్న పరిస్థుతులు ప్రస్థుతం టాలీవుడ్ లో నడుస్తున్నాయి. దీనితో చిన్న హీరోల దగ్గర నుంచి చిన్న సినిమాల నిర్మాతల వరకు రాజమౌళి తమ సినిమాల గురించి కామెంట్ చేస్తే బాగుండును అనే స్థాయికి చేరిపోయారు.

ఇలాంటి పరిస్థుతులలో ఈవారం విడుదల కాబోతున్న ‘సైజ్ జీరో’ సినిమాను ఈమధ్య ప్రత్యేకంగా రాజమౌళికి దర్శకుడు ప్రకాష్ చూపించాడని టాక్. రాఘవేంద్రరావు సూచనతో రాజమౌళి ఈసినిమాను చూడటమే కాకుండా ఈసినిమాలోని ప్రతి సీన్ ను ఒకటికి రెండు సార్లు రాజమౌళి దర్శకుడు ప్రకాష్ అతడి భార్య కనికా ధిల్లాన్ తో చర్చించి కొన్ని రిపేర్లు చేసినట్లు ఫిలింనగర్ టాక్.

సెన్సార్ కు వెళ్ళడానికి ముందు ‘సైజ్ జీరో’ లో రాజమౌళి ఏమి రిపేర్లు చేసాడు అన్నది ఈ సినిమా యూనిట్ కు కూడ తెలియకుండా అత్యంత రహస్యంగా జరిగింది అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే రాజమౌళి ‘సైజ్ జీరో’ కి సంబంధించి చేసిన రిపేర్లు అనుష్క పాత్రకు సంబంధించినవా? లేదంటే హీరో ఆర్యా పాత్రకు సంబంధించినవా ? అన్న విషయం పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే రాజమౌళి చేసిన సూచనలు ఈసినిమా నిడివికి సంబంధించినది అనే వార్తలు కూడ ఉన్నాయి. రాఘవేంద్రరావు శిష్యుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న రాజమౌళి తన గురువు ఋణం ఈ ‘సైజ్ జీరో’ రిపేర్ల విషయంలో ఎలా మార్పులు చేసాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రాజమౌళి చేయి తగిలితే చాలు బాగంరంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థుతులలో ‘సైజ్ జీరో’ కు రాజమౌళి చేతి మహిమ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: