గతవారం విడుదలైన ‘కుమారి 21 ఎఫ్’ మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్స్ లో కూడ దూసుకు పోతోంది. ఈవారాంతానికి ఈసినిమా 10 కోట్ల కలెక్షన్స్ ను దాటి పోతుంది అని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒక విలక్షణ దర్శకుడు చేసిన డేరింగ్ ప్రయత్నానికి మేధావుల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకులు కూడ ఫిదా అయిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇది ఇలా ఉండగా ‘కుమారి 21 ఎఫ్’ సాధించిన ఘన విజయంతో ఈసినిమా రీమేక్ రైట్స్ కోసం కోలీవుడ్ మాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమా నిర్మాతల నుండి సుకుమార్ కు భారీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్. 

సుకుమార్ అంచనాలకు మించి ఈసినిమా రీమేక్ రైట్స్ ఆఫర్లు వస్తున్నా ఈ విషయాల పై ఏమి స్పందించకుండా ప్రస్తుతం తన దృష్టి అంతా జూనియర్ తో తీస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పైనే అని సుకుమార్ చెపుతున్నట్లు టాక్. అయితే ఈ విషయాలు ఇలా ఉంటే సుకుమార్ కేవలం చిన్న సినిమాలకు మాత్రమే పనికి వస్తాడా ? అనే కామెంట్స్ ను కొందరు విశ్లేషకులు చేస్తున్నారు. దీనికి కారణం టాప్ హీరోలతో సుకుమార్ తీసిన చాల సినిమాలు పరాజయం అవడం అని అంటున్నారు. 

గతంలో అల్లుఅర్జున్ కు ఎలాంటి ఇమేజ్‌ లేనప్పుడు ‘ఆర్య’ తీసి అతడి కెరియర్‌ కి పునాదులు వేసిన సుకుమార్‌ ఆతర్వాత అల్లుఅర్జున్‌ టాప్ హీరో అయిన తరువాత ‘ఆర్య 2’ తీసి ఫెయిల్యూర్ అన్న మాటను తెచ్చుకున్నాడు. ఈసినిమాలో బన్నీ పాత్రను డిఫరెంట్ చూపెట్టడం చాల మందికి అర్ధంకాలేదు. ఆతరువాత నాగచైతన్యకు స్టార్ ఇమేజ్ లేకపోయినా ‘100% లవ్’ తీసి సక్సస్ ను అందుకున్నాడు. ఆ తరువాత మహేష్ తో ‘వన్ నేనొక్కడినే’ తీసి ఘోరమైన ఫ్లాప్ ను మహేష్ కు ఇచ్చాడు. దానితో షాక్ అయిన సుకుమార్ చాల గ్యాప్ తీసుకుని ఎంతో కష్టపడి జూనియర్ ను ఒప్పించి ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ తీస్తున్నాడు. 

ఈసినిమాలో కూడ జూనియర్ నటిస్తున్న పాత్ర సైకో లక్షణాలతో ఉంటుందని ఫిలింనగర్ లో గాసిప్పులు వినపడుతున్నాయి. సుకుమార్ కథలు స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా వ్రాయలేడని సుకుమార్ స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడంలో సుకుమార్ ఎక్కడో అక్కడ ఫెయిల్ అవుతున్నాడు అంటూ కొందరు విశ్లేషకులు ఒక కామెంట్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. అయితే సుకుమార్ కు ‘కుమారి 21 ఎఫ్’ ఇచ్చిన పేరు నిలబడాలి అంటే జూనియర్ తో తీస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ ఖచ్చితమైన విజయం సాధించాలి. ఏది ఎలా ఉన్నా రాబోతున్న సంక్రాంతి ఈ లెక్కల మాస్టార్ కు పెద్ద పరీక్ష పెడుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: