తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అజిత్, విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది..ఇదే ఫాలోయింగ్ గత కొంత కాలం నుంచి హిరో సూర్య కి కూడా వచ్చింది. గజిని సినిమా తర్వాత సూర్యకి తమిళ నాట మంచి మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా సూర్య హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. సూర్య - సమంత జంటగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

సూర్య గెటప్ ని రెండు విభిన్నమైన షేడ్స్ తో ఇచ్చిన పోస్టర్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఒకదాంట్లో గెటప్ తో నావల్టీ చూపించిన సూర్య మరో పోస్టర్ లో కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తున్నాడు.  రెండు పోస్టర్స్ ఎలక్ట్రిఫైయింగ్ గా డిజైన్ చేశారు.  అప్పట్లో చియాన్ విక్రం హీరోగా ఇలియానా హీరోయిన్ గా పిక్చర్ ని స్టార్ట్ చేసినా.. తర్వాత నిలిపేయాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అందించడంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ విఫలం కావడంతో.. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు మెయిన్ థీమ్ అదే తీసుకుని.. కేరక్టర్లు - సన్నివేశాలను సంపూర్తిగా మార్చేసి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్తో మరింతగా పెరిగాయి.

సూర్య 24 చిత్రంలో సమంత,నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించనున్నారనే వార్తలు రాగా విడుదలైన రెండు లుక్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఒక చిత్రంలో సూర్య సైంటిస్ట్ గా కనిపిస్తుండగా మరో చిత్రంలో పూర్తి ఢిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఆన్ లైన్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కాసేపటికే.. లక్షల కొద్దీ క్లిక్స్ వచ్చేస్తున్నాయి. 

సూర్య ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: