‘బ్రూస్ లీ’ షాక్ నుండి ఇంకా తేరుకోకుండానే చిరంజీవికి త్రివిక్రమ్ షాక్ తగిలింది అంటూ వార్తలు వస్తున్నాయి. అమెరికా నుంచి రామ్ చరణ్ తిరిగి వచ్చిన తరువాత చరణ్ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్ళి చిరంజీవి 150వ సినిమా విషయమై చర్చలు జరిపాడు అన్న వార్తల పై త్రివిక్రమ్ సన్నిహితులు మీడియాకు ఇచ్చిన లీక్ మెగా కుటుంబానికి షాక్ ఇచ్చినట్లు టాక్. 

ఈమధ్య చిరంజీవి వ్యక్తిగతంగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఒక మంచి కథను రెడీ చేయమని కోరినట్లుగా వార్తలు వచ్చిన నేపధ్యంలో చిరంజీవి త్రివిక్రమ్ ల కాంబినేషన్ సెట్ అవుతుందా ? అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేసాయి. అయితే ఈ వార్తలు అన్నీ త్రివిక్రమ్ కాంపౌండ్ కు చేరడంతో త్రివిక్రమ్ వ్యూహాత్మకంగా తన సన్నిహితుల చేత చిరంజీవి 150వ సినిమా చేసే విషయమై ప్రస్తుతానికి త్రివిక్రమ్ కు ఎటువంటి ఆలోచనా లేదని సంకేతాలు ఇచ్చే ఈలీక్ లు ఇప్పించి ఉంటాడని అంటున్నారు.

ప్రస్తుతం నితిన్ తో ‘అ ఆ’ సినిమాను తీస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా పూర్తి అయిన తరువాత కోలీవుడ్ హీరో సూర్యాతో పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు తీయవలసిన నేపధ్యంలో త్రివిక్రమ్ కు చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఖాళీ ఎక్కడ ఉంటుందని త్రివిక్రమ్ సన్నిహితులు కామెంట్ చేసినట్లు టాక్. దీనితో చిరంజీవి 150వ సినిమా దర్శకుల లిస్టు నుండి త్రివిక్రమ్ తప్పుకున్నట్లే అనుకోవాలి.

మెగా స్టార్ గా మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ సినిమా రంగాన్ని శాసించిన చిరంజీవికి తన 150వ సినిమాకు సంబంధించిన కథ విషయంలో దర్శకుడు విషయంలో ఏర్పడుతున్న సమస్యలు చూస్తూ ఉంటే సినిమా కష్టాలను తల పిస్తున్నాయి అంటూ కనిపిస్తున్న పరిస్థుతుల పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరంజీవికి 150వ సినిమా మోక్షం ఎప్పుడో ?


మరింత సమాచారం తెలుసుకోండి: