సోషల్ మీడియా ద్వారా నిరంతరం తమ అభిమానులకు టచ్ లో ఉండి తమ క్రేజ్ ను పెంచుకోవాలని మన సినిమా సెలెబ్రెటీలు చేసే వింత ప్రయోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ వివరాల ప్రకారం ఏకంగా ‘బాహుబలి’ రికార్డులను ఒక బెడ్ రూమ్ ఫోటో బ్రేక్ చేయడం ఈరోజు  హాట్ టాపిక్. 

ఇక వివరాలలోకి వెళితే బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్‌ కపూర్ తన వైఫ్ రాజ్‌పూత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోమవారం రాత్రి తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇది ఎంతగా పాపులర్ అయిందంటే కేవలం 24 గంటల్లో ఆ ఫోటోకు 12 లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా 5,500 మంది ఈఫోటోని తమ స్నేహితులతో షేర్ చేసుకోగా ఆఫోటో పై 10 వేలకుపైగా కామెంట్స్ వచ్చాయి. 

ఎక్కువమంది నటిజన్స్  ఈ జంటను మెచ్చుకోగా మరికొందరు రకరకాల ద్వందార్ధాలతో కామెంట్ చేసారు. దీనితో ఈఫోటో వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ బెడ్ రూమ్ ఫోటో ఏకంగా ప్రభాస్ ‘బాహుబలి’ రికార్డులను లైక్స్ విషయంలో బ్రేక్ చేసింది. 

ఈమధ్య ప్రభాస్ ఫేస్ బుక్ లో ‘బాహుబలి’ సినిమాలో జలపాతం దగ్గర ప్రభాస్ నుంచుని ఉన్న ఫోటోను పెట్టారు. ఈ ఫోటోకు దాదాపు నాలుగున్నర లక్షల లైక్స్ వచ్చాయి. ఈ రికార్డులను చూసి ప్రభాస్ అభిమానులు మురిసిపోయారు. అయితే ఇది జరిగి కొద్ది రోజులు గడవకుండానే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డును బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ బ్రేక్ చేయడం సంచలనంగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: