తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కుర్ర హీరోల హవా నడుస్తుంది. ఒకవైపు సీనియర్ హీరోల పుత్ర రత్నాలు వారసులుగా ఎంట్రీ ఇస్తున్నా..కుర్ర హీరోలు తాము కూడా తక్కువేం కాదని దూసుకు వెళ్తున్నారు. దర్శకులు శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ చిత్రంలో హీరోగా నటించిన నిఖిల్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.  స్వామిరార సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది..  ప్రస్తుతం నిఖిల్ నటించిన ‘శంకరాభరణం’ చిత్రం వచ్చే నెల 4వ తేదిన విడుదల కానుంది. నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంవివి సత్యనారాయణ నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది అందులోనే పవన్ కళ్యాన్ చేతులు మీదుగా టీజర్ విడుదల కావడంతో మనోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. శంకరాభరణం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.  ‘టైగర్’ సినిమాకు దర్శకత్వం వహించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు వుండనున్నారు. తాప్సీని మొదటి హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక రెండవ హీరోయిన్ గా అవికా గోర్ ను ఎంపిక చేసారు.

 ‘శంకరాభరణం’  పోస్టర్


త్వరలోనే మూడవ హీరోయిన్ ను ఫైనలైజ్ చేయనున్నారు.  ఫాంటసీ తరహాలోమంచి లవ్ స్టోరీ అని ఈ సినిమా నిఖిల్ విభిన్న పాత్రలో నటించబోతున్నట్లు ఆద్యంతం కామెడీ,  ప్రేమకథతో సాగిపోతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నెల రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: