ఈ సంవత్సరం ‘టెంపర్ ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ తదుపరి చిత్రం సుకుమార్ తో చేస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ లుకింగ్ పూర్తి డిఫరెంట్ గా ఉంది.. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వాచ్చాయి. లండన్ లో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా... రాయలసీమలో ఫ్యాక్షన్ తరహా పాత్రలో ఎన్టీఆర్ కనిపించ బోతున్నాడట.  

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకులు కొరటాల శివ శ్రీమంతుడు చిత్రం సంచలన రికార్డు క్రియేట్ చేశారు. అయితే గత కొంత కాలంగా ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాలనే ఉద్దేశ్యం కొరటాల శివకు ఉండటం...అందులోనూ శ్రీమంతుడు సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కూడా తన తదుపరి చిత్రం కొరటాలతో ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. సినిమా టైటిల్ ‘జనతా గ్యారేజ్’.. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లడమే మిగిలివుంది. మరి ఇప్పుడు ఏమైందో కానీ ఈ విషయంపై అస్సలు చర్చలు జరగడం లేదు..ఏమాత్రం న్యూస్ కూడా బయటకు రావడం లేదు. ఒకదశలో జూనియర్ ప్రాజెక్టును పక్కనబెట్టి.. బన్నీతో సెట్స్‌పైకి వెళ్లాలని కొరటాల ప్లాన్‌గా చెబుతున్నారు.

జనతా గ్యారేజ్ షూటింగ్ ముహూర్తం


బన్నీకి సంబంధించి స్టోరీ కూడా రెడీ అయ్యిందని, అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుకావడం ఖాయమట. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్, కొరటాలకు మద్య మంచి స్నేహ సంబంధం ఉంది. అయితే  కొరటాల  ఇలా చేస్తాడంటే తాము నమ్మలేకపోతున్నామని జూనియర్ ఫ్యాన్స్ అంటున్నారు.  ఎవరో ఈ రూమర్ క్రియేట్ చేశారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వార్తలు  సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: