ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న మూవీ రోబో2. బాహబలి2 మూవీ తరువాత శంకర్ తెరకెక్కిస్తున్న రోబో2 మూవీపైనే అందరి దృష్టి పడింది. బాహుబలి కంటే రోబో2 మూవీ గొప్పగా ఉంటుందంటూ ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ నటిస్తున్న ఈ రోబో2 మూవీ కథ బయటకు వచ్చిందంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం రజినీకాంత్ మాఫియా డాన్ గా చేస్తున్న‘కబాలి’ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.


మలేషియా, బ్యాంకాక్ లలో జరుగుతోన్న ఈ షూటింగ్.. త్వరలోనే టాకీ పార్ట్ ని పూర్తి చేసుకోనుంది. అలాగే సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ అనంతరం, రజనీ రోబో2కి సంబంధించిన పనులలో బిజిగా కానున్నాడు. అయితే కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు రజనీకాంత్ రోబో2లో అయిదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రోబో2 మూవీలో ప్రధానంగా ఓ విలన్ ఉంటాడు.


అలాగే రజనీకాంత్ ని పోలిన రజనీకాంత్ లు అయిదుగురు ఉంటున్నారు. వీరిలో ఒకరు హీరోకి సపోర్ట్ చేసే రజనీకాంత్ కాగా, మిగిలిన నలుగు విలన్స్. ఇక విలన్ రోల్ లో కనిపిస్తున్న రజనీకాంత్ లను, అలాగే వాటిని క్రియేట్ చేసిన హ్యూమన్ విలన్...ఇలా వీరి ఆగడాలని రజనీకాంత్ ఏ విధంగా అరికట్టగలిగాడనేది చిత్ర కథాంశంగా ఉంటుందని అంటున్నారు. ఇందులో  రజనీకాంత్ కి సపోర్ట్ చేసే మరో రోబో రజనీకాంత్ పాత్ర హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.. ఇక త్వరలోనే డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలలో రోబో సీక్వెల్ కోసం టెస్ట్ షూట్ చేయనున్నారు.


ఇప్పటికే రజినీకాంత్ లుక్ మీద కొన్ని లుక్స్ డిజైన్ చేసారు. రజినీకాంత్ కి ఏది బెస్ట్ లుక్ అయితే దానిని ఫిక్స్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 14న రజినీకాంత్ బర్త్ డే కానుకగా ఈ సినిమాని లాంచ్ చేసి జనవరి నుంచి రెగ్యులర్ షూట్ ని మొదలు పెట్టనున్నారు. ‘రోబో 2’ మూవీని మార్కెట్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్ తో మార్కెటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసి, ఇప్పటికే వీరు బిజినెస్ వ్వవహారాలను ప్రారంభినట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: