నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ 100వ చిత్రం పై ఇప్పటి నుండే హై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో బాలకృష్ణ చేస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ చివరిలో పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఓ రేంజ్ లో చేయనున్నారు.


ఇక ఈ మూవీ తరువాత బాలయ్య చేయ్యబోతున్న 100వ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే బాలయ్య, జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ మూవీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా నిలిచింది. ఇదే కాంబినేషన్ ని బాలయ్య 100వ మూవీలోనూ రిపీట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సారి బాలయ్య 100వ మూవీలో విలన్ గా నటించనున్న జగపతిబాబు, భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్నాడు. దాదాపు 3.25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని జగపతి బాబు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.


ఇప్పటి వరకూ జగపతిబాబు లక్షల్లోనే రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు. కానీ బాలయ్య 100 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇందుకు జగపతి బాబుని మెయిన్ విలన్ గా తీసుకొని పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తున్నారంట. అందుకే  జగపతి బాబుకి సైతం భారీ రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేసినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


ఇక తాజా సమచారం ప్రకారం, బాలకృష్ణ 100వ సినిమాని ఆయన బర్త్ డే కానుకగా 2016 జూన్ 10వ తేదీన లాంచ్ చేయనున్నారు. బాలయ్యతో ‘సింహా’, ‘లెజెండ్’లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని త్వరగా పూర్తి చేసి, బాలయ్య వందో మూవీపై పనిచేయటానికి బోయపాటి ఆసక్తి  చూపుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: