ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో ‘సరైనోడు’ సినిమాను చేస్తున్న అల్లుఅర్జున్ ఈ సినిమా పూర్తి అయిన తరువాత   విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు అని ఇప్పటి దాకా అనుకున్నారు. అయితే అందరి ఊహలకు ట్విస్ట్ ఇస్తూ బన్నీ కొరటాల జూనియర్ ల సినిమాకు అడ్డుగోడగా మారాడు అనే వార్తలు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘శ్రీమంతుడు’ సూపర్ సక్సస్స్ తరువాత కొరటాల శివ జూనియర్ తో మొదలు పెట్టిన కొత్త సినిమా ఆగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ వార్తలు ఫిలింనగర్ లో ఎందుకు హల్ చల్ చేస్తున్నాయి అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా బయటకు వస్తున్న ఈవార్తలు ఫిలింనగర్ కు షాకింగ్ న్యూస్ గా మారింది. ఇప్పటికే జూనియర్ కొరటాల శివల సినిమా లాంచనంగా ప్రారంభం కావడమే కాకుండా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక పై దృష్టి పెట్టి కొంతమంది బాలీవుడ్ బ్యూటీలకు  ఈ విషయమై ఇప్పటికే ఆడిషన్స్ కూడ నిర్వహించాడు అన్న వార్తలు ఉన్నాయి. 

అయితే ఈ వార్తలు ఎవరో కావాలని కొరటాల శివ జూనియర్ ల ఇమేజ్ ని దెబ్బ తీయడానికి ఈ వార్తలు సృష్టించినట్లు జూనియర్ సన్నిహితులు అంటున్నారు. కొరటాల శివ జూనియర్ ల సినిమా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడానికి సుకుమార్ తీస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉండిపోవడం అని అంటున్నారు. ఈ విషయాల పై కొరటాల శివకు జూనియర్ కు స్పష్టమైన అవగాహన ఉన్నా హడావిడి చేస్తున్న ఈ గాసిప్పులను చూసి వారిద్దరూ షాక్ అయినట్లు టాక్. 

‘బృందావనం’ సినిమాకి రచయితగా పనిచేసిన నాటినుండి జూనియర్ కొరటాల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. కొరటాల టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు అని జూనియర్ తనకు సూచనలు ఇస్తూ ఉంటాడని కొరటాల ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అటువంటి సాన్నిహిత్యం ఉన్న వీరిద్దరి సినిమా వ్యవహారంలో వివాదాలకు దూరంగా ఉండే బన్నీ వచ్చి చేరడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: