రజనీకాంత్ కు సమస్యగా పవన్ మహేష్ లు  మారారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న ‘కబాలి’ షూటింగ్ అనుకున్న వేగంతో జరుగుతూ ఉండటంతో ఈసినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖున విడుదల చేయడానికి ఈసినిమా దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విడుదల తేది పై ఈసినిమా కోలీవుడ్  డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి అభ్యంతరం లేక పోయినా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ మార్కెట్ కు సమస్యగా మారుతుంది అన్న ఫీడ్ బ్యాక్ ఈ సినిమా నిర్మాతలకు అందుతోంది అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  

దీనికి కారణం అదే నెలను టార్గెట్ చేస్తూ పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మహేష్ ‘బ్రహ్మోత్సవం’ అల్లుఅర్జున్ ‘సరైనోడు’ విడుదలకాబోతూ ఉండటం అని అంటున్నారు.  సమ్మర్ ను టార్గెట్ చేస్తూ ముగ్గరు టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఏప్రిల్ 4న రజనీకాంత్ ‘కబాలి’  తెలుగు డబ్బింగ్ కు  సరి అయిన సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ దొరకవని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. 

దీనితో తెలుగు హీరోల సినిమాలను దృష్టిలో పెట్టుకుని ‘కబాలి’ విడుదల తేది మారే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈవార్తలు ఇలా ఉండగా రాబోతున్న సమ్మర్‌ 2016 టాప్ హీరోల సినిమాల మెగా ఫైట్ కు సంబంధించి ఒక అవగాహన మహేష్ పవన్ బన్నీల మధ్య కుదిరింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తలప్రకారం పవన్‌కల్యాణ్ మహేష్‌బాబు అల్లుఅర్జున్‌లు ఒక అండర్ స్టాండింగ్‌ కు వచ్చినట్టు టాక్. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’, ‘సరైనోడు’ సినిమాల మధ్య గ్యాప్ ఉండేలా ఈ ముగ్గురు టాప్ హీరోలు ఒక నిర్ణయం తీసుకున్నారని టాక్. 

ఈ విషయమై మన టాప్ హీరోలు చర్చించుకుని ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మార్చిలో రిలీజ్ చేయాలన్నది స్కెచ్ అని అంటున్నారు. ఇక ‘బ్రహ్మోత్సవం’ ఏప్రిల్‌ లో రానుంది. మరోవైపు ‘సరైనోడు’ కూడా అదేనెలలో రానుంది. కాకపోతే వారం అటుఇటుగా వస్తుందని అంటున్నారు. ఈ భారీ సమ్మర్ ఫైట్ రీత్యా రజనీకాంత్ తన ‘కబాలి’ విడుదల ఆలోచనలలో ఎంత వరకు మార్పులు చేసుకుంటాడో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: