తెలుగు ఇండస్ట్రీలోకి బాలనటిగా వెండి తెరకు పరిచయం అయిన మీనా  ‘సీతారామయ్య గారి మనవరాలి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు,తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో నటించి మంచి పేరు సంపాదించింది. వివాహం తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు..ఆ మద్య వెంకటేశ్, మీనా కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం సినిమాలో కనిపించింది. తాజాగా మీనా కూతురు నైనిక వెండి తెరకు పరిచయం కాబోతోంది.


విజయ్ హీరోగా తెరకు ఎక్కుతున్న ఓ కోలీవుడ్ మూవీలో మీనా కూతురు నటిస్తోంది. ఇంతకు ముందు సమంత మనం తెలుగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఈసారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించబోతోంది. హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న సమయంలో తల్లి పాత్ర ద్వారా సాహసం చేసిన తర్వాత మళ్లీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదని అనుకుందట. పులి సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన విజయ్.. ప్రస్తుతం నటిస్తున్న 59వ చిత్రంతో ఆ లోటు భర్తీ చేస్తానంటున్నాడు.


రాజా-రాణి ఫేం అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ మూవీలో విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్నటితరం కథానాయిక మీనా కూతురు నైనిక.. సమంతకు కూతురుగా నటించనుండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: