‘అఖిల్’ షాక్ కు తట్టుకోలేక ఈ మధ్య విదేశాలకు వెళ్ళిన వినాయక్ ఆషాక్ నుండి తేరుకుని భాగ్యనగరం తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమా రంగంలో ఏదర్శకుడు తీసుకొని సంచలన నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. భారీ అంచనాలతో విదుదల అయిన ‘అఖిల్’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కనీసం 20 శాతం పెట్టుబడి కూడ తిరిగిరాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలిసిందే.

ఈ పరిస్థుతులలో కొందరు డిస్ట్రిబ్యూటర్లకు వినాయక్ తనకు ఈసినిమా వల్ల వచ్చిన పారితోషికంలో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చి కొందరు డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలు ఘోరపరాజయం చెందినప్పుడు హీరోలు తమ పారితోషికాలలో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చివేసిన సందర్భాలు గతంలో చాల జరిగాయి. అయితే ఒక దర్శకుడు తాను దర్శకత్వం వహించిన సినిమా నష్టాన్ని భరించడం ఇదే మొట్టమొదటిసారి అని అంటున్నారు. 

ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘అఖిల్’ సినిమాను విడుదల చేసి ఘోరంగా నష్టపోయిన విశాఖపట్నం కృష్ణాజిల్లాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లకు వినాయక్ ఈ సహాయం అందిస్తున్నాడు అని టాక్. ఈమధ్యనే ఈ డిస్ట్రిబ్యూటర్లను వినాయక్ ప్రత్యేకంగా పిలిపించుకుని తన నిర్ణయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది.

అయితే వినాయక్ చేస్తున్న ఈ సహాయం వెనుక మరొక కారణం ఉంది అని అంటున్నారు. విశాఖపట్నం కృష్ణాజిల్లాలకు చెందిన ఈ డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ వినాయక్ కు అత్యంత ఆత్మీయులు అవడమే కాకుండా వినాయక్ తీసిన ప్రతి సినిమాను ఆయన పేరును చూసి కొంటారు అని టాక్. అందువల్ల తన పరపతికి నష్టం కలగకుండా వినాయక్ చాల వ్యూహాత్మకంగా ‘అఖిల్’ విషయంలో చాల తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: