‘సైజ్‌ జీరో’  కోసం అనుష్క చేసిన సాహసం రిజల్ట్ ఎలా వస్తుందో తెలియకపోయినా రాజమౌళి అనుష్కకు పెట్టిన డెడ్ లైన్ అనుష్కను టార్చర్ పెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సైజ్ జీరో’ కోసం అనుష్క పెరిగిన బరువులో గత మూడు నెలలుగా ఆమె ఏడు కేజీలు మాత్రమే బురువు తగ్గింది అని టాక్. సహజ పద్ధతుల ద్వారానే బరువు తగ్గే  ప్రయత్నాల్లోఅనుష్క ఉండటంతో ఆమె శరీరంలో మార్పులు చాల స్లోగా వస్తున్నాయని అంటున్నారు. ‘బాహుబలి 2’ కు అనుష్క రెడీ కావాలి అంటే  ఆమె మరో పదికేజీలు బరువు తగ్గితే కాని రాజకుమారిగా అనుష్క మారే అవకాశం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

అయితే డిసెంబర్‌ 17న ‘బాహుబలి 2’ కు రాజమౌళి ముహూర్తం నిర్ణయించడంతో అనుష్కకి మరో వారం రోజుల టైమ్  ఇచ్చిన రాజమౌళి డిసెంబర్‌ 25 నుంచి షూటింగ్‌కి రమ్మని చెప్పాడట. అయితే ఆగడువు ఇక కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇంత తక్కువ కాలంలో ఇది జరిగే పనేనా అన్న అనుమానం అనుష్కను వెంటాడుతోంది అని అంటున్నారు. 

అనుష్కకు ఈ సమస్యలు ఇలా ఏర్పడటానికి ‘సైజ్ జీరో’ సినిమా విడుదల ఆలస్యం అవ్వడం అనే వార్తలు కూడ ఉన్నాయి. ఈ సినిమాను నిర్మించిన పివిపి నిర్మాణ సంస్థ ఈ సినిమా ప్రమోషన్ కోసం అనుష్కను తన భారీ శరీరాన్ని మెయిన్ టైన్ చేయవలసిందిగా కోరడంతో అనుష్క తన భారీ శరీరం తగ్గించుకునే విషయంలో నెమ్మదిగా అడుగులు వేసింది అన్న వదంతులు కూడ ఉన్నాయి. 

ఇక ‘బాహుబలి 2’ షూటింగ్ తేదీ దగ్గర పడటంతో ‘సైజ్ జీరో’ సినిమాకు కోలీవుడ్ లో ప్రచారం చేయడానికి  అనుష్క స్థానంలో తమిళ రంగానికి చెందిన ఒక కామెడీ నటితో ప్రచారం చేయిస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా రేపు ‘సైజ్ జీరో’  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లలో విడుదల కాబోతూ ఉండటం సంచలన వార్తగా మారింది. ధియేటర్ల సంఖ్యతో పాటుగా కేజీ బంగారం స్కీమ్ కూడ చేరడంతో ఈసినిమాకు మహిళా ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: