ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార కృష్ణ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోతున్నారు. మహేష్ బాబు శ్రీమంతుడు సూపర్ హిట్ సాధించింది. ఇప్పటికీ ఈ శ్రీమంతుడి మానియా ఇంకా పోలేదు. సుధీర్ బాబు వామిక జంటగా నటించిన భలే మంచి రోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ వ్యక్తి జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనలే బేస్ గా చేసుకుని ఈ మూవీ తీస్తున్నామని ముందే చెప్పాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.



ఆ ఒక రోజుని ఎంత పర్ఫెక్ట్ గా చూపించారనే విషయం.. ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా డైలాగ్స్ కూడా సూపర్బ్ గా కుదిరాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓ ఆడియో వేడుక అభిమానులకు మంచి ఆనందంతో పాటు మరింత వినోదాన్ని పంచింది. ఇక ఈ ఆడియో ఫంక్షన్ అగ్ర హీరోలతో కళ్ల సంబూరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలి భల్లాల దేవ రానా ప్రత్యేక అతిథిలుగా విచ్చేశారు. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని తెలుసు మందు తాగితే లివర్ చెడుతుందని తెలుసు కానీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎవరికి తెలుసు" అంటూ ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

 భలే మంచి రోజు పోస్టర్


అక్కడి నుంచి వరుసగా కేరక్టర్స్ పరిచయం ఛేజింగ్ లు కామెడీ ఫైటింగ్ లు మంచి విజువల్ ట్రీట్ లాంటి సాంగ్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా సాయికుమార్ అయితే చెలరేగిపోయాడనే చెప్పాలి. సినిమా మొత్తం కిడ్నాపింగ్ పైనే నడుస్తుందని ఆద్యంతం కామెడీతో సాగిపోతుందని చిత్ర బృందం తెలిపింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తన కెరీర్ లో మంచి హిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హీరో సుదీర్ బాబు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: