ఈ మాట అంటుంది ఎవరో కాదు  తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్లలో వరుస విజయాలతో  దూసుకు వెళ్తున్నఅందాల భామ రకూల్ ప్రీతి సింగ్. ఇంతకీ ఈ అమ్మడు అన్న మాటేమిటా అని అనుకుంటున్నారా..! ఇక నుంచి తనకు ఎవరి మాట సహాయం అవసరం లేదట..! తెలుగుచిత్రసీమలో వరుస విజయాలతో టాలీవుడ్ బ్యూటీ రకుట్ ప్రీత్ సింగ్  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. మొదట్లో చిన్న హీరోలతో పరిచయం అయినప్పటికీ ఈ భామకు వరుసగా అదృష్టం కలిసి వస్తుంది..ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల సరసన నటిస్తూ అందరితో షెబాష్ అనిపించుకుంది.


ఏ హీరోకైనా మంచి జోడీగా సెట్ అవుతున్న రకూల్ హీరోయిన్ గా కావాలన్న హీరోలు కూడా లేకపోలేదు. ఈ అమ్మడు బాలీవుడ్ నుంచి వచ్చింది..స్వతహాగా మోడలింగ్ నుంచి వచ్చిన రకూల్ గ్లామర్ పాత్రలు, లిప్ లాక్ సీన్లంటే విపరీతంగా రెచ్చిపోతుంది. ఇప్పటికీ తనతో నటించిన ప్రతి హీరోతో లిప్ లాక్ సీన్లో పాల్గొంది.  ఇక తెలుగు పరిశ్రమే బెటర్ అనుకుందో ఏమో కానీ తెలుగు నేర్చుకోవడానికి తెగ కష్టపడుతుంది.

రకూల్ ప్రితి సింగ్



కొన్ని ఇంటర్వ్యూల్లో తెలుగు కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి తన డబ్బింగ్ తనే చెప్పుకుంటా అంటుంది. ప్రస్తుతం రకుల్ ఎన్టీయార్ తో నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో ‘ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు బాగా మాట్లాడే రకుల్ ని దర్శకుడు సుకుమార్ తన పాత్రకు తననే డబ్బింగ్ చెప్పమన్నాడట.  ఇప్పటి వరకు పక్క వారి గొంతుపై ఆధారపడ్డ ఈ అమ్మడు మరి సొంత గొంతుతో సెక్సీగా డైలాగ్స్ కొట్టి మెప్పిస్తుందో లేదో చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: