సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి మహేష్ తర్వాత వచ్చిన హీరో సుధీర్ బాబు.. ముందు కొద్దిరోజులు మహేష్ ని సినిమా ప్రమోషన్స్ కి వాడినా లాభం లేకపోయేసరికి కాస్త ఆలోచించి స్వతహాగానే సినిమాలు చేయడం మొదలెట్టాడు. అయితే సినిమాలు బాగున్నా సినిమాకు హైప్ రాకపోవడంతో ఢీలా పడ్డాడు సుధీర్. ఈ ఇయర్ లో మోసగాళ్లకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమాలు చేసినా ఏది హిట్ మార్క్ టచ్ చేయలేదు. కాస్త కృష్ణమ్మలోనే తన నటనలో మంచి మార్కులు పడేలా చేసుకున్నాడు సుధీర్ బాబు.


ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన సినిమా భలే మంచి రోజు.. శ్రీ రాం ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా చేస్తుంది. నిన్న జరిగిన ఆడియో వేడుకకు సూపర్ స్టార్ ముఖ్య అతిధిగా వచ్చి ఆడియో రిలీజ్ చేశారు. సుధీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. తను కష్టపడే విధానం చూస్తే తనకు నచ్చుతుందని.. కరెక్ట్ సినిమా పడితే అతను స్టార్ అవ్వడం ఖాయం అని అన్నాడు. అంటే సూపర్ స్టార్ మహేష్ ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ కి సుధీర్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయండని హింట్ ఇచ్చినట్టు ఉంది.


ప్రస్తుతం వారసుల జోరులో కొట్టిమిట్టాడుతున్న పరిశ్రమలో తమ తర్వాత వచ్చిన హీరోలను నిలబెట్టే భాధ్యత కూడా స్టార్ హీరోల మీద పడ్డది అందుకే ఫ్యామిలీ అభిమానులను ఎమోషనలైజ్ చేస్తూ సినిమా భారీ విజయం అయ్యేలా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు తక్కువగా మాట్లాడే మహేష్ కూడా సుధీర్ కోసం కరెక్ట్ సినిమా ఇదే దీన్ని సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత ఫ్యాన్స్ దే అంటూ అభిమానులకు పంచ్ వేశాడు. మరి సినిమా అభిమానులకు రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.


సినిమా థియేటర్ ట్రైలర్ చాలా ప్రాంసింగ్ గా ఉంది. సాయి కుమార్ ఇందులో కామెడీ విలన్ చేయడం విశేషం. నిన్న ఆడియో వేడుక జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించే చాన్స్ ఉంది. ప్రస్తుతం జోరు మీదున్న చిన్న సినిమాల హవాని చూస్తుంటే ఈ సినిమా కంటిన్యూ చేసేట్టుగానే ఉంది. మరి మహేష్ మాట విన్న ఫ్యాన్స్ సినిమాని భారీ హిట్ చేసి సుధీర్ ని స్టార్ చేసేస్తారనే ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: