అదృష్టం బాగాలేకుంటే కర్రే పామై కాటేస్తుంది అన్న సామెతలా ఉంది బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పరిస్థితి. యావత్ బారత దేశంచే మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న హీరో ఇప్పుడు మిస్టర్ వరస్ట్ అంటున్నారు. ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖుల అవార్డుల విషయం, ఆహారపు (గోమాంసం) అలవాట్ల విషయాలపై భారత దేశంలో గందరగోళం చెలరేగుతుందని ఈ అసహనం పై  నా భార్య కిరణ్‌రావ్ పలుమార్లు నాతో చర్చించింది. ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్దామని ప్రతిపాదించిందని పేర్కొన్నారు.

భారత్‌లో తీవ్ర అసహనం ఉందని, ఓ సందర్భంలో తన భార్య ఈ దేశం నుంచి వెళ్లిపోదామన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన పైన నెటిజన్లు, బిజెపి మండిపడుతోంది. రామ్ గోపాల్ వర్మ సహా పలువులు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరో పక్క ఆయనకు సపోర్ట్ చేసే యాక్టర్ కూడా తయారయ్యారు.. తెలుగు సినిమా హీరో నవదీప్ అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఇది ట్రూ స్టోరీ అనే ట్యాగ్ చేసారు. అంతేకాదు అమీర్ ఖాన్ మాట్లాడిన వీడియోని షేర్ చేసారు.   అమీర్ వ్యాఖ్యలు పిరికితనాన్ని ప్రతిబింభించేలా ఉన్నాయన్నారు.


కుటుంబ సభ్యులతో అమీర్ ఖాన్


'మత అసహనం పెరిగి పోతుంటే దానిని అరికట్టేందుకు పోరాడాలి కాని... భయం వేస్తోంది... దేశం వదిలిపోతానని చెప్పడం సరికాదని ఉపేంద్ర ట్విట్టర్ లో పేర్కొన్నారు.  మరో పక్క అమీర్ ఖాన్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం లేదు.. తాను అన్న దానికి కట్టుబడే ఉంటానని అంటున్నారు.  భారత్‌ విడిచి వెళ్లే ఉద్దేశం తనకు, తన భార్యకు లేదని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడనివారే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదని అన్నారు.

నవదీప్ ట్విట్ : 

హీరో ఉపేంద్ర ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: