ఒకే ఫ్యామిలీ నుండి హీరోల సంఖ్య పెరిగితే, కచ్ఛితంగా హీరోయిన్స్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడక తప్పదు. కానీ కొన్ని సందర్భాలు ఇద్దరూ ఒకే హీరోయిన్స్ తో రొమాన్స్ చేయకా తప్పదు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరోల విషయంలోనూ అదే జరగనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఐదేళ్ల క్రితం ఏ మాయ చేసావె సినిమా ద్వారా తొలిసారి వెండితెరపై కనిపించిన నాగచైతన్య, సమంత ఇండస్ట్రీకి కొత్త లుక్ ని ఇచ్చింది.

ఆ తరవాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతూ వస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య, సమంత జంటగా మనం, ఆటో నగర్ సూర్య మూవీలో నటించారు. నాగాచైతన్యతో కెమిస్ట్రీ సక్సెస్ టాక్ ని తెచ్చుకోవటంతో, ఈ బ్యూటీ నాగార్జున సరసన పలుసార్లు ఆఫర్స్ ని కోల్పోవలసి వస్తుంది. నాగచైతన్య సరసన నటించిన హీరోయిన్ కావటంతో, నాగార్జున ఎట్టిపరిస్థితుల్లో హీరోయిన్ గా తీసుకోవాటానికి ఒప్పుకోలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరో అఖిల్ మాత్రం సమంతతో రొమాన్స్ చేయటానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. తన మొదటి మూవీ అఖిల్ బాక్సాపీస్ వద్ద పరాజయం కావటంతో, రెండో మూవీకి సంబంధించిన స్టార్ కాస్టింగ్ పై ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ని చూపుతున్నాడు. ఇక ఇప్పటికే రెండో మూవీకి సంబంధించిన వివరాలు దాదాపు ఫైనల్ అయినట్టుగా తెలుస్తున్నాయి.

అయితే వాటికి సంబంధించిన న్యూస్ ని మాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇక తన రెండో మూవీలో హీరోయిన్ గా సమంతని కన్ఫర్మ్ చేయటానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అఖిల్ సైతం సమంత ని హీరోయిన్ గా తీసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో అఖిల్, సమంత కాంబినేషన్ పిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ ని తలపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: