620 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ ను వసూలు చేసి తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటిన ‘బాహుబలి’ క్రేజ్ అత్యంత ఖరీదైన పెళ్ళిళ్ళకు కూడ తాకింది. ‘బాహుబలి’ సినిమా సెట్ ను చూసి ప్రభావితమైన ఒక ఎన్నారై 55 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో ‘బాహుబలి’ సెట్ ను డిజైన్ చేసిన సాబు శిరిల్ చేత ఒక భారీ సెట్ ను డిజైన్ చేయించి అత్యంత ఘనంగా ఆ ఎన్నారై ఈరోజు జరిపిస్తున్న పెళ్ళి జాతీయ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఇక వివరాలలోకి వెళితే ఆ ఎన్నారై పేరు రవి పిళ్లై. ఇతను కేరళాకు చెందిన వాడు. అరబ్ దేశాల్లో పేరు పొందిన ఇతడికి గల్ఫ్‌లో కన్‌స్ర్టక్చన్, ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్, మైనింగ్, ఎడ్యుకేషన్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. ఆర్‌పీ గ్రూప్‌ కు చెందిన 26 కంపెనీలున్న గ్రూప్‌ కు అధినేత ఇతడు. దాదాపు 80 వేల మంది ఇతడి దగ్గర పని చేస్తున్నారు అంటే ఇతడి స్థాయి అర్ధం అవుతుంది. కేరళలో  కొల్లంలోని ఆశ్రమం మైదానంలో ఈరోజు ఇతడి కూతురు డాక్టర్ ఆరతి పెళ్లిని దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్ళిగా జరుగుతోంది. 

ఈయన ఎక్కడ చూసాడో తెలియదు కాని ‘బాహుబలి’ సినిమాలోని సెట్ ను చూసి ఆకర్షితుడై ‘బాహుబలి’ ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్‌కు వెడ్డింగ్ సెట్స్ డిజైన్ పనులను అప్పగించాడట. 200 ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో దాదాపు 8 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలతో రాజస్థానీ స్టయిల్‌ లో ఈసెట్ ను రెడీ చేసాడట. అనేకమంది హీరోయిన్స్ తో పాటు ఫిలిం సెలెబ్రెటీలు మంజు వారియర్స్, శోభనలు ట్రెడిషనల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ. మ్యారేజ్‌కు దాదాపు 42 దేశాల లీడర్స్ హాజరు కానున్నారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వివిధ కంపెనీల సీఈఓలు, ప్రభుత్వ అధికారులు, పొలిటీషియన్స్, రాయబారులు ఈ పెళ్ళికి వస్తున్నారు. 

తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నుంచి వీవీఐపీలను కల్యాణ మండపానికి చేర్చేందుకు రెండు స్పెషల్ విమానాలు ఏర్పాటు చేసారు అంటే ఈ పెళ్ళి యొక్క స్థాయి తెలుస్తోంది. ఇండియాలో జరుగుతున్న అతి ఖరీదైన పెళ్ళిగా రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ పెళ్ళి నేపధ్యం వెనుక కూడ రాజమౌళి ‘బాహుబలి’ క్రేజ్ ఉంది అంటే రాజమౌళి ‘బాహుబలి’ స్థాయి ఏమిటో అన్నది అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: