14 సంవత్సరాల ఫిలిం కెరియర్ లో 50 సినిమాలలో నటించిన అల్లరి నరేష్ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తన అభిమానులచేత హీరోగా పిలిపించుకునే కంటే కమెడియన్ గా పిలిపించుకోవడంలోనే చాల ఆనందాన్ని పోoదు తాను అంటూ హీరో స్టేటస్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లరి నరేష్. తన సినిమాలకు టైటిల్ కార్డ్స్ వేస్తున్నప్పుడు చాలామంది నిర్మాతలు తన పేరుకు ముందు ‘కామెడీ కింగ్’ అనే ట్యాగ్ ను పెడతామని చాలామంది కోరినా తనకు తన అభిమానులచేత అల్లరి నరేష్ అని పిలిపించు కోవడం ఇష్టం అని అంటూ హీరోల ట్యాగ్ లపై సెటైర్లు వేసాడు ఈ అల్లరోడు. 

తాను నటించిన 50 సినిమాలలో మొత్తం 68 హీరోయిన్ లు ఉండటంతో ఇంత మందితో తాను రొమాన్స్ చేసానా అని ఆశ్చర్యం తనకు కలుగుతూ ఉంటుంది అంటూ తాను 14 మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాను అని అంటూ తన జనరేషన్ లో ఇన్ని రికార్డులు ఉన్న యంగ్ హీరో మరెవ్వరూ లేరు అంటూ తన రికార్డులను మరోసారి గుర్తు చేసుకున్నాడు ఈ అల్లరి నరేష్. 

ఈమధ్య కాలంలో తన సినిమాలు వరస పరాజయం పొందుతున్న విషయమై స్పందిస్తూ ప్రస్తుత తరం ప్రేక్షకులు రొటీన్ కామెడీ చిత్రాలను చూడటం మానివేసారని అందువల్ల డిఫరెంట్ కథలతో కూడిన హాస్య సినిమాలను ఎంచుకోవలసి వస్తోందని అంటూ స్క్రిప్ట్ ల ఎంపికలో తాను పొరపాటు చేస్తున్న విషయాన్ని చాల ఆలస్యంగా గుర్తించాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇప్పటి వరకు తాను 50 సినిమాలలో నటించడంతో తన సినిమాలను ధియేటర్లలో కాని లేదా టివిలలో కాని చూడని వారు ఉండరు అని భావిస్తూ ఉండేవాడినని అయితే తన భార్య విరూప తన సినిమాలలో ఒక్క సినిమా కూడ చూడలేదు అని అనడం తనకు ఇప్పటికీ షాకింగ్ న్యూస్ అని అంటూ తన పెళ్ళి అయ్యాక విడుదలైన ‘జేమ్స్ బాండ్’ సినిమాను చూసి ఆనంద పడ్డ తన భార్యను తన పాత సినిమాలు చూస్తావా ? అని అడిగినప్పుడు ఒక స్వీట్ స్మైల్ ఇచ్చింది అని అంటూ తన భార్య పైనే సెటైర్ వేశాడు అల్లరోడు..    


మరింత సమాచారం తెలుసుకోండి: