తెలుగు ఇండస్ట్రీలోకి టీనేజ్ లోనే ‘దేవి’ చిత్రంతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు.   చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ఇక ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.  ఆయన కేవలం సంగీత దర్శకుడే కాదు. మంచి డ్యాన్సర్ కూడా యువతకు నచ్చే మంచి పాటల రచయితగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటికే.  దేవీ రాసిన పాటలన్నీ సూపర్ హిట్ లే సాంగులే... సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫాంలో ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ తను ఏ సినిమాకు సంగీతం అందించినా  ఆడియో ఫంక్షన్లో హంగామా చేస్తాడు.


తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలకు సంగీతం అదించటంతో పాటు  బాలీవుడ్ లో కూడా ప్రతాపం చూపించాడు. ఇండస్ట్రీలో దేవీశ్రీ హీరోయిన్స్ తో చాలా జాలీగా ఉంటాడని..అంతే కాదు కొంత మందితో ఎఫైర్లు కూడా ఉన్నాయని చాలా రూమర్లు వచ్చాయి. ఆ మద్య చార్మితో ప్రేమాయం నడిపించాడని వార్తలు కోడై కూసాయి. తాజాగా ఈ సంగీత దర్శకుడు త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ ఏడాది చివర్లో దేవి శ్రీ ప్రసాద్ త‌న పెళ్లి క‌బురు వినిపించబోతున్న‌ట్లు తన సన్నిహితుల నుండి విన‌వస్తున్న సమాచారం.

దేవీశ్రీ ప్రసాద్


ఇప్పటికే టాలీవుడ్ లో తనకు సన్నిహితంగా ఉన్న ప్రముఖులకు ఈ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దేవి శ్రీ తను గత కొంత కాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లుగా పెద్దలను ఒప్పించి ఆ అమ్మాయినే వివాహం చేసుకోబొతున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రానికి, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నాడాయ‌న‌. అంతేకాదు త‌మిళ నాట కూడా వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్నాడు.హీరోగా చేసే అవ‌కాశాలు ఉన్నా వాటినీ వ‌ద్ద‌నుకుంటున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: