చరణ్ మొదటి సినిమా చిరుత.. ఆ సినిమాలో పోకిరి కుర్రాడిలా చేసిన చరణ్ తో రొమాన్స్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా శర్మ. చంకా చంకా చంకీరే అంటూ మెరుపులు మెరిసిన అమ్మడు ఆ తర్వాత పెద్దగా అవకాశాలను చేజిక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కుర్రాడు సినిమాలో వరుణ్ సందేష్ తో నటించినా లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం నేహా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పినట్టే.. అయితే అక్కకి కలిసి రాని టాలీవుడ్ చెల్లికి మాత్రం ఘన స్వాగతాలు పలుకుతుంది. మోడలింగ్ నుండి సరాసరి హీరోయిన్ అయ్యేందుకు సిద్ధగా ఉన్న ఐశా శర్మ ప్రస్తుతం తెలుగులో రెండు మూడు ప్రాజెక్ట్స్ కి ఫైనల్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేస్తుంది.


నాగచైతన్య ఇష్టపడి చేస్తున్న మలయాళ ప్రేమం రీమేక్ మజ్నులో మెయిన్ హీరోయిన్ అయిన ఐశా.. ఆ తర్వాత పూరి రోగ్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది. అక్కకి చాన్స్ ఇచ్చిన పూరియే చెల్లికి ఇవ్వడం మంచి విషయమే. ఇకపోతె చరణ్ కూడా నేహా సిస్టర్ అదేనండి ఐశాకి చాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం తనిఒరువన్ తెలుగు రీమేక్లో నటించేందుకు రెడీ అయిన చెర్రి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు చాలామంది పేర్లు వినపడ్డా ఫైనల్ గా ఐశా శర్మని ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడట.


ప్రెస్ మీట్ లో నేహ శర్మ, ఐశా శర్మ :


ప్రస్తుత ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిశెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుందని సమాచారం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అల్లు అరవింద్ నిర్మించడం విశేషం. కోలీవుడ్లో జయం రవి నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా చేసింది. మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా చిన్న బడ్జెట్ తో రూపొందించినా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చెర్రి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీదున్నాడు. బ్రూస్ లీ మిగిల్చిన అవమాన భారం ఈ సినిమా హిట్ కొట్టి కడిగేయాలనుకుంటున్నాడు.


మరి నేహా తో చేసిన మొదటి సినిమా హిట్ కాబట్టే చరణ్ ఇలా తన ప్రస్థానన్ని కొన్సాగిస్తున్నాడు. మరి చెల్లితో చేసే ఈ సినిమా కూడా హిట్ అయ్యి మరోసారి సిస్టర్స్ ని తన సినిమాకు ప్రిఫర్ చేసేలా చూస్తాడేమో చూడాలి. చిరుతతో నేహాతో రొమాన్స్ చేసిన చెర్రి ఈ సినిమాతో ఐశాతో రొమాన్స్ చేసెందుకు సిద్ధమయ్యాడు. మరి ఇద్దరి సిస్టర్స్ తో రొమాన్స్ చేసిన చరణ్ ఆ సెంటిమెంట్ తోనే సినిమాను హిట్ చేసుకుంటాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: