ఈ మాటలు అంటుంది తెలుగు ఇండస్ట్రీలోకి వైవీఎస్ చౌదరి నిర్మించిన ‘దేవదాసు’ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నడుం వొంపు సొంపులతో కుర్రాల మతులు పోగొట్టిని గోవా బ్యూటీ ఇలియానా.  అయితే మొదట్లో ఈ అమ్మడికి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి ఎంతగా అంటే అప్పట్లోనే తన రెమ్యూనరేషన్ కోటికి పైగా తీసుకుంది. తర్వాత కొత్త హీరోయిన్ల కాంపిటీషన్ తట్టుకోలేక బాలీవుడ్ కి జంప్ చేసింది.

అక్కడ కూడా ఒక సినిమా మినహా ఏవీ అంతగా ఆడలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ బెటర్ అనుకుంది ఇక్కడికే వచ్చేస్తానంటుంది. అయితే గతంలో ఈ అమ్మడు ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇలియానా..అవన్నీ అసత్యాలు అని ఈ భామ తెలిపింది. తనకు లవర్ ఉన్న మాట నిజమేనని తెలుపుతూ, తన లవర్ తో తాను సంతోషంగా ఉన్నాను అని చెప్పింది.

అయితే ప్రస్తుతం తన లవర్ పనిమీద ఆస్ట్రేలియా వెళ్ళడంతో గత కొన్ని రోజులుగా ఆయనకు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. అయితే ఇద్దరం ఫోన్ టచ్ లో ఇప్పటికీ ఉన్నామంటూఈ గోవా బ్యూటీ పేర్కొంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీతో ఈ అమ్మడు క్రేజ్ మళ్లీ పెంచుకుంటుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: