బాహుబలి మూవీతో ఇండియన్ డైరెక్టర్ గా మారిపోయిన క్రేజీ డైరెక్టర్ రాజమౌళి. ఇదిలా ఉంటే, రాజమౌళి ఈ మధ్య కాలంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీకి దక్కాల్సిన ప్రతిష్టాత్మక అవార్డులేవి దక్కలేదు. దీంతో చాలా నిరుత్సాహపడుతున్న రాజమౌళికి తాజాగా గోవాలో  జరుగుతున్న జాతీయ చలన చిత్రోత్సావాలు ఫుల్ జోష్ ని ఇచ్చాయంట. ఇప్పటికే రాజమౌళికి, జ్యూరీ సభ్యుల నుండి క్లియర్ మెసేజ్ లు రావటంతో, తన సంతోషాలకు హద్ధే లేకుండా పోయిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇండియన్ సినిమాల్లో ఐఫా అవార్డులను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ప్రత్యేకంగా భావిస్తారు.

అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఐఫా అవార్డ్స్ పై ఇండస్ట్రీలో పెద్ద చర్ఛే జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం ప్రత్యేకతను సంతరించుకుంటూనే ఉంటున్నాయి. అయితే ప్రతి సంవత్సరం ఇది బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈసారి మొదటిసారిగా, ఐఫా వేడుక సౌతిండియన్ సినిమాలోనూ జరుపుకుంటుంది.

దీంతో తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషలకు చెందిన సినిమాలు ఈ వేడుకలో అవార్డులను స్వీకరించనున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఐఫా, త్వరలోనే అంటే... ఐఫా ఉత్సవం డిసెంబర్ నెల మొదటి వారంలో పెద్ద ఎత్తున జరగనుంది. ఈ ఉత్సవానికి భారీ ఎత్తున సినీ ప్రముఖులు ఇక్కడకు హాజరుకానున్నారు. ఆ రోజు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని, వేడుకలో పార్టిసిపెట్ చేయనున్నాయి.

ఇదిలా ఉంటే తెలుగులో రెండు మూవీలకి పలు క్యాటగిరీల్లో నామినేషన్స్ దక్కాయి. అవే ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ మూవీలు.  ఈ రెండు మూవీలు ఐఫా వేడుకల్లో సత్తా చాటనున్నాయి. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ దెబ్బకి సౌత్ ఫిల్మ్ క్లీన్ స్వీప్ అయింది. అంతే కాకుండా ఈ మూవీ ఏకంగా 14 క్యాటగిరీల్లో నామినేషన్లు సొంతం చేసుకోవటంతో కనీసం 12 క్యాటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకోనుందని అంటున్నారు.

తరువాత ‘శ్రీమంతుడు’ 11 క్యాటగిరీల్లో నామినేషన్లను సొంతం చేసుకోసం కనీసం 7 క్యాటగిరీల్లో అవార్డును సొంతం చేసుకోనుందని అంటున్నారు. ఇక రాజమౌళికి ఈ న్యూస్ పై క్లారిటి మెసేజ్ ఉండటంతో, అవార్డ్స్ ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడంట. డిసెంబర్ 6నుంచి మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: