దసరా కానుకగా రిలీజ్ అయిన బ్రూస్ లీ మూవీ, రామ్ చరణ్ కి నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. దాదాపు 8 సంవత్సరాల తరువాత స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సిల్కర్ స్క్రీన్ పై ఎక్కువ సేపు నటించిన మూవీ బ్రూస్ లీ అయినప్పటికీ, ఇది ప్రేక్షకుల ఆధరణ పొందటంలో విఫలమైంది. రామ్ చరణ్, చిరు కాంబినేషన్ గా వచ్చిన మూవీ కావటంతో బిజినెస్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయి, రిలీజ్ కి ముందే దాదాపు 10 కోట్ల రూపాయల లాభాలతో రిలీజ్ అయింది.

నిర్మాతగా వ్యవహరించిన దానయ్య...విపరీతమైన లాభాలను పొందాడు. ఇక సినిమా రిలీజ్ అనంతరం వచ్చిన టాక్స్ తో మూవీ ఘోరంగా నష్టాలను చవిచూసింది. దీంతో ఎగ్జిబిటర్లు, బ‌య్య‌ర్లు సైతం రామ్ చరణ్ పై అందోళ‌ను దిగారు. అలాగే నిర్మాత వద్ద నష్టపరిహారం చెల్లించాలంటూ పలువురు పట్టుబట్టి కూర్చున్నారు. ఇక చేసేది లేక నష్టపోయిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించటానికి నిర్మాత ప్రయత్నాలు చేశారు. ఇక ఈ మూవీకి సంబంధించిన నైజాం రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు.

దిల్ రాజు సైతం ఈ మూవీని భారీ రేటుకి కొని, బాగా నష్టపోయనట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగానే నైజాం రైట్స్ ని కొన్న దిల్ రాజుకి, 4 కోట్ల రూపాయల మేర నష్టాలను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై దిల్ రాజు... నిర్మాత దానయ్య అలాగే రామ్ చరణ్ పై సీరియస్ గా ఉన్నట్టు ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. అయితే నష్టాలకు సంబంధించిన విషయాన్ని రామ్ చరణ్ కి దిల్ రాజు చెప్పాడంట కానీ, నష్టపరిహారాన్ని మాత్రం ఇవ్వమని అడగలేదు.

భవిష్యత్ లో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ పలు మూవీలు చేయనున్నాడు. అందుకే నిర్మాత దానయ్యతో మాట్లాడి దిల్ రాజుకి నష్టపరిహారం కింద రెండున్నర కోట్ల‌ను ఇప్పించినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం దిల్ రాజు కొద్దిగా కూల్ అయ్యాడని అంటున్నారు. ఇక మిగిలిన బ‌య్య‌ర్లు, పంపిణీ దారుల‌తోనూ రామ్ చరణ్, నిర్మాత దాన‌య్య వద్ద నుండి ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఇప్పించనున్నట్టు తెలుస్తుంది.

అలాగే దానయ్య సైతం భ‌విష్య‌త్తులో మెగా ఫ్యామిలీ హీరోల‌తో వరుస సినిమాలను తీయాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి, చరణ్ సెటిల్మెంట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడంట. మొన్నటి వరకూ రికార్డ్ లని క్రియేట్ చేసిన మూవీగా బ్రూస్ లీ పై చూపించిన లెక్కలు, ఇప్పుడు తప్పుడు లెక్కలని తెలియటంతో అంతా షాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: