నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా టైటిల్ మాత్రం డిసైడ్ అవ్వలేదు కాని సినిమాలో నాని బాలయ్య బాబు అభిమానిగా కనిపిస్తాడని తెలుస్తుంది. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 14 రీల్స్ పతాకంలో నిర్మించబడుతుంది. అయితే సినిమాలో నాని రోల్ బాలయ్య అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా ఉంటుందని అన్నారు. అయితే ఏదో మాములుగా ఉంటుందెమో అనుకున్నారంతా కాని నిన్న జరిగిన సైజ్ జీరో ప్రివ్యూ షోకి నాని చేతికి జై బాలయ్య టాటూ చూసి అందరు షాక్ అయ్యారు.


సినిమాలో అభిమాని అంటే ఎదో అలా ఉంటాడేమో అనుకుంటే నాని టాటూతో కనిపించి అందరు అవాక్కయ్యేలా చేశాడు. రీసెంట్ గా భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న నాని ఈ సినిమాతో మరో హిట్ కొట్టేస్తాడనిపిస్తుంది. బాలయ్య అభిమానిగా కనిపించి సినిమాని పెద్ద రేంజ్ కి తీసుకెళ్లాలని దర్శక నిర్మాతల ఆలోచన. నాని బాలయ్య అభిమానిగా అలరించనున్నాడు. అందుకే నాని జై బాలయ్య టాటూతో కనిపించాడు. సాధారణంగా ఒక స్టార్ హీరో మరో స్టార్ కి అభిమానిగా సినిమాలో కనిపించడం అనేది జరుగదు.


బాలయ్య టాటూతో నాని :


మన వాళ్లు ఇక్కడ ఫాన్స్ హర్ట్ అవుతారని రజిని ఫ్యాన్స్ గా కనిపించిన సందర్భాలు ఉన్నాయ్ కాని మన బాలయ్య అభిమానిగా కనిపిస్తూ షాక్ ఇవ్వబోతున్నాడు నాని. భలే మగాడు సినిమాతో నాని మార్కెట్ రేంజ్ కూడా బాగా పెరిగింది. నాని ఇప్పుడు నాచురల్ స్టార్ అంటే స్టార్ స్టేటస్ కట్టబెట్టారు కాబట్టి స్టర్ డం వచ్చేసినట్టే. అయితే మగాడు సినిమా తర్వా వస్తున్న సినిమా కాబట్టి సినిమా మీద అభిమానులు కూడా చాలా అంచనాలు ఏర్పాటుచేసుకున్నారు.


మరి రాబోయే ఈ సినిమా టైటిల్ కూడా జై బాలయ్య అని పెడతారేమో అని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. సంక్రాంతి పోరులో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. మరి నాని భలే మగాడి మ్యాజిక్ ని ఇందులో కూడా కంటిన్యూ చేస్తాడనే ఆశిస్తున్నారు ఫ్యాన్స్. సినిమా వస్తేనే గాని తెలియదు నాని బాలయ్య అభిమానిగా ఎలా అలరించనున్నాడని.


మరింత సమాచారం తెలుసుకోండి: