నాగచైతన్య ఈమధ్య ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత అతడి పెళ్ళి వార్తలు కూడ వచ్చాయి. అయితే అవన్నీ సద్దుమణిగి పోయాయి. కానీ ఒక కొత్త హీరోయిన్ చైతూ విషయంలో మరో సంచలన విషయం బయట పెట్టింది. నాగచైతన్యకు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయట పెట్టింది. ప్రస్తుతం చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటిస్తున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్ బయట పెట్టిన చైతూ అలవాట్లు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధి చైతన్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పండి అని అడిగినప్పుడు మంజిమా మోహన్ చైతన్య సీక్రెట్ బయట పెట్టింది. చైతూ చాల తిండిపోతు అట. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ను చాల ఇష్టంతో చైతన్య లాగించేస్తాడట. ఇక ఐస్ క్రీమ్ ల విషయంలో అయితే హద్దు లేదు అని అంటోంది. 

అయితే ఇన్ని రకరకాల ఫుడ్స్ తినే చైతన్య జంక్ ఫుడ్స్ విషయంలో చాల జాగ్రత్తగా ఉంటాడు అని చెపుతోంది ఈ కొత్త భామ. ఇన్ని రకరకాల ఫుడ్స్ తిన్నా లిమిట్స్ లోనే ఉంటూ ప్రతిరోజు జిమ్ లో కష్టపడటంలో తన బాడీని కంట్రోల్ లో పెట్టుకుంటాడు అని చైతన్య అలవాట్లను బయట పెట్టింది మంజిమా మోహన్. ఇదే సందర్భంలో ఆమె చైతూ గురించి మాట్లాడుతూ అమ్మాయిలతో చాల అభిమానంగా ఉండే చైతన్య అంటే ఇష్టపడని హీరోయిన్ ఉండదు అని కామెంట్ చేసింది. 

అందుకే కాబోలు చైతన్యతో నటించడానికి శ్రుతిహాసన్ లాంటి టాప్ హీరోయిన్ కూడ ఒప్పుకుంది. గౌతమ్ మీనన్ తీస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో అమ్మాయిలను, బైక్స్ ను విపరీతంగా ఇష్టపడే నేటితరం యూత్ అలవాట్లకు ప్రతిబింబంగా ఉండే పాత్రలో  చైతన్య ఈసినిమాలో  నటిస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: