ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసిన ‘బాహుబలి’ ఈ సంవత్సరపు బిగ్గెస్ట్ హిట్స్ లో స్థానం సంపాదించుకోలేదు అని కొందరు విశ్లేషకులు తెరపైకి తీసుకు వస్తున్న ఒక వాదం రాజమౌళికి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి ‘బాహుబలి’ కలెక్షన్స్ విషయంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలకు పోలుస్తూ లెక్కలు చూసుకుంటే ‘బాహుబలి’ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కాదు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

‘బాహుబలి’ పార్ట్ వన్ 130 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఆసినిమాకు వచ్చిన షేర్ 300 కోట్లు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం 7 కోట్ల పెట్టుబడితో తీసిన నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా ఈసినిమాకు సంబంధించి నికర షేర్ 28 కోట్లుగా తేలింది అని అంటున్నారు. అంటే 1 రూపాయికి 4 రూపాయల లాభాన్ని నాని తెచ్చిపెడితే ఇంత హంగామా చేసిన ‘బాహుబలి’ కి ఆ స్థాయిలో లాభాలు రాలేదు అన్నది వాస్తవం. 

ఈ రేంజ్ లో లాభాలు తెచ్చి పెట్టిన సినిమాల లిస్టులో ఓంకార్ తీసిన ‘రాజు గారి గది’ సినిమా కూడ చేరి ఆ సినిమా బయ్యర్లకు 1 రూపాయికి 3 రూపాయల లాభం తెచ్చి పెట్టింది. ఇదే బాటలో ఇదే సంవత్సరం విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’, ‘పటాస్’ సినిమాలు కూడ రూపాయికి రూపాయి లాభాలు తెచ్చి పెట్టడంతో ‘బాహుబలి’ కన్నా చిన్న సినిమాలే నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయా ? అనే విశ్లేషణలకు తావిస్తోంది.

అయితే ఇటువంటి వార్తలు విశ్లేషణల రూపంలో చర్చించు కోవడానికి బాగుంటాయి కాని చరిత్రలో ‘బాహుబలి’ లా మిగిలిపోవు అన్నది వాస్తవం. అయినా ఈ వాస్తవాల విశ్లేషణలు రాజమౌళి దృష్టి దాక వెళతాయి కాబట్టి ఈ కామెంట్స్ కొంత వరకు రాజమౌళికి షాకింగ్ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: