సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ సమయంలో గాయాలు పాలు కావడం సహజమే.. అయితే ఈ గాయాలు ఒకోసారి తీవ్ర స్థాయిలో జరుగుతుంటాయి. ఒకప్పుడు అమితాబచ్చన్ కూలీ సినిమాలో పెద్ద గాయం జరిగింది..ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక రజినీకాంత్, చిరంజీవి, కమల్ లాంటి పెద్ద లకు బాలీవుడ్ లో రీసెంట్ గా షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ల కు గాయాలైనా అవి పెద్దగా కాకపోవడం వల్ల షూటింగ్ లో కొనసాగించారు.

షూటింగ్ సమయాల్లో హీరోయిన్లు కూడా ప్రమాదాల పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ అందాల భామ  బిపాసా బసు డర్ సబ్ కో లగ్ తా హై అనే హరర్ టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోండగా , ఈ అమ్మడు తన మేకప్ విషయంలో గాయపడాల్సి వచ్చింది.

తన హెయిర్ సెట్ చేసేందుకు బిపాసా ఓ హెయిర్ స్టెలిస్ట్ ను పిలిపించుకోగా ఆ సమయంలో అనుకోకుండా బిపాస ముఖంపై, కుడి చెయ్యి పై పడటంతో కాలి గాయాలయ్యాయి. దీంతో ఆమెపై ఫుల్ సీరియస్ అయ్యిందట..ఏదేమైనా గాయాలు మాత్రం అయ్యాయి..ఇలా జరిగిన తన కార్యక్రమాన్ని తాను తప్పక కొనసాగిస్తానంటూ ఈ అమ్మడు తెలిపింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: