‘బాహుబలి’ అవంతిక తమన్నాకు ఆ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ తో నటించే అవకాశం లభించడమే కాకుండా అనేక ప్రముఖ జ్యూయలరీ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడమే కాకుండా తాను సొంతంగా మొదలు పెట్టిన జ్యూయలరీ ఆన్ లైన్ బిజినెస్ లో కూడ అనుకోని విజయాలను సాధించింది తమన్నా. ప్రస్తుతం తమన్నా క్రేజ్  అమెరికాకు కూడ సోకడంతో అక్కడ కూడ ఆమెకు డాలర్ల వర్షం కోరుస్తోంది. 

మరి కొద్ది రోజులలో రాబోతున్న నూతన సంవత్సర వేడుకలను అమెరికాలోని భారతీయుల కోసం బాలీవుడ్ డ్రీమ్స్ అనే సంస్థ చాల వినూత్నంగా అమెరికాలోని గ్రాడీ కోల్ సెంటర్ లో నిర్వహించబోతోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ఈవెంట్ కు 89 డాలర్ల టిక్కెట్ నిర్ణయించడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక ఫ్యామిలీకి అయితే 169 డాలర్లను టిక్కెట్ గా నిశ్చయించారట.

అయితే తమన్నాకు ఉన్న క్రేజ్ రీత్యా ఈ టిక్కెట్ ధర పెద్దగా ఎక్కువ కాదు అని మన ఇండియన్స్ కామెంట్ చేస్తున్నట్లు టాక్. దీనితో ఈ షోను నిర్వహిస్తున్న బాలీవుడ్ డ్రీమ్స్ సంస్థ తన వేగాన్ని మరింత పెంచడమే కాకుండా అవంతిక క్రేజ్ ను లక్షల డాలర్ల రూపంగా మార్చబోతున్నారు. అమెరికాలో ఇటువంటి షోలకు తమన్నాకు ఆహ్వానం లభించలేదు. అయితే ‘బాహుబలి’ ఆమె క్రేజ్ ను అమెరికాలో కూడ నిలబడేట్టుగా చేసింది. 

ఇప్పటికే తన ‘వైట్ అండ్ గోల్డ్’ జ్యూయలరీ బిజినెస్ పెంపుదలకు ఆలోచనలు చేస్తున్న తమన్నా అమెరికాలో తాను చేయబోతున్న న్యూయియర్ సెలిబ్రేషన్స్ తో ఆమె క్రేజ్ అమెరికాకు కూడ విస్తరిస్తూ ఉండటంతో అక్కడ కూడ ఆమె జ్యూయలరీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది. ‘బాహుబలి’ హవా తమన్నాకు అదృష్టంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: