బాలీవుడ్ లో ఈ మద్య ఒక సినిమా గురించి చెబితే అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. సామాన్య మానవులు చేయని సాహసాలు ఈ మనిషి చేస్తూంటే ఔరా అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో హృదయ కాలేయం సినిమాతో వెండి తెరపై హల్ చల్ చేసి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కే దడ పుట్టించేలా ఉన్నాడు. ఎందుకంటే ఈయన కూడా సంపూలాగా ఎవ్వరికీ సాధ్యంకాని సాహసకృత్యాలు చేస్తాడు.

రాక్ స్టార్ లా వేసిన స్టెప్పులు , గాలిలో విన్యాసాలు, వందలమంది సైన్యాన్ని ఒంటిచేత్తో మట్టికరిపించడాలు. రాజస్థాన్ డేరా సచ్చ సౌదా సంస్థను నడుపుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా మారి MSG-2 అనే సినిమాను చేశాడు.  ఈ సినిమాలో ఈయన చేసిన విన్యాసాలు చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీలో సంపూ బ్రదర్ లా కనిపించాడు. అంతే కాదు పంచ్ డైలాగులు కూడా బీభత్సంగా కొట్టాడు.  

MSG2 చిత్రంలో  గుర్మీత్ రామ్


ఇలా ఇతను చేసిన వింతవింత విన్యాసాలకు కడుపు చక్కలవ్వాల్సిందే.మనోడి గురించి ఇంకా చెప్పాలంటే… రాళ్ళను పిండి చేస్తాడు, ఎన్ని బాణాలను తనపై సందించినా ఆయన ముందు అవన్నీ చిట్టి చీమలే, ఇక జంతువులైతే ఆయన చేసే సాహసాలకే దిమ్మతిరగాల్సిందే. ఇది క్రిటిక్స్ నుండి కూడా పొగడ్తలను అందుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ యే ఓ కొత్త ట్రెండ్ కు తెరతీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: