తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ భామల హవా కొనసాగుతూనే ఉంది..ఇప్పటికే రకూల్ ప్రితిసింగ్ మంచి చాన్సులతో దూసుకు పోతుంది..తాజాగా ‘కంచె’ చిత్రంతో అందరిని తనవైపు తిప్పుకున్న నటి మోడల్ ప్రగ్యా తాజాగా రెండో సినిమాకు రెడీ అయ్యింది. అయితే ఈ కంచే  సినిమాలో గ్లామర్ ప్రాధాన్యం లేక పోవడం వల్ల పెద్దగా పేరు రాకపోయినా తన అందంతో ఆకట్టుకుంది. కంచెలో ఆమె నటనని చూసినవారంతా ఫిదా అయిపోయారు.

తెలుగు లో ప్రగ్యా కు మంచి భవిష్యత్ ఉందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నట్లే ఈ అమ్మడికి వెంటనే మరో టాప్ హీరో సరసన చాన్స్ వచ్చింది.  ఈ సినిమా కూడా హిట్టయ్యిందంటే నిస్సందేహంగా ఆమె స్టార్ అయిపోయినట్టే. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఎవడో ఒకడు సినిమాకోసం  ప్రగ్యాని  కథానాయికగా ఎంచుకున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుంటారు.

కంచె పోస్టర్


ప్రేమమ్ ఫేమ్ అనుపమ ఒక హీరోయిన్ కాగా కంచె భామ ప్రగ్యా మరో హీరోయిన్. యాక్షన్, కామెడీ ఓరియెంటెడ్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ గా ఉండబోతుందట. ఇంకేముంది ఈ అమ్మడు ఎంత గ్లామర్ ప్రదర్శిస్తే అంత ఫామ్ లోకి వస్తుంది. ఇందులో రవితేజ లెక్చరర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: