తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్రహీరోయిన్ గా చెలామణి అయిన హీరోయిన్లు జయసుధ, జయప్రద,శ్రీదేవి,రాధిక,రాధ వీరి తర్వాతనే ఏ హీరోయిన్ అయినా.. అంత మంచి ఫామ్ లో కొనసాగారు ఈ తారలు.  ఇక జయప్రద విషయానికి వస్తే అందం, అభినయంతో పాటు మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. అందుకే ఆమెను చాలా సినిమాలో హీరోలు తమ పక్కన నటించమని కోరి మరీ తీసుకునే వారు. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న జయప్రద తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది.

అక్కడ కూడా మంచి హీరోయిన్ గా పేరు పొందింది. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఎంపీగా గెలిచింది. జయప్రద కుమారుడు సిద్ధార్థ్‌ -ప్రవళ్లిక రెడ్డి ల వివాహం ఘనంగా జరిగింది.   హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లోని కేబీఆర్‌ కన్వెన్షన్ హాల్‌లో నిన్న ఈ పెళ్లి వేడుకును నిర్వహించారు..ఈ వివాహనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

జయసుధ, జయప్రద డ్యాన్స్

jayaprada son siddharth marriage pics 11

ఉత్తరప్రదేశ్‌ సమాజ్ వాది పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి, టీడీపీ ఎంపీ రాంమోహన్‌ రావు, టీఆర్‌ఎస్‌ నేత తీగల కృష్ణారెడ్డి, తో సహా పలువురు ప్రముఖులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.  ఈ వేడుకకు ఆమె తోటి నటులు జయసుధ,రాధిక తెగ హంగామా చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సిద్దార్థ్‌ జయప్రద సోదరి కుమారుడు ఆయనను జయప్రద దత్తతకు తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: