తెలుగు చలన చిత్ర సీమలో  రాజమౌళి తీసిన చిత్రం ‘బాహుబలి’ ఎన్నో సంచలనాలకు నాంధి పలికింది. ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా ఏమిటో నిరూపించింది.  జానపద చిత్రాలు హాలీవుడ్ రేంజ్ లో తీసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి దక్కించుకున్నాడు. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్లతో  దుమ్మురేపింది. ఇక కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కూడా భారస్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.

సోషల్ మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. గత కొంత కాలంగా బాలీవుడ్ కి పరిమితమైన ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు) అవార్డుల కార్యక్రమం తొలిసారి దక్షిణాది చిత్రాలకు ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో నిర్వహించనున్న 15వ ఐఫా అవార్డుల కార్యక్రమంలో తెలుగు.. తమిళన.. కన్నడ.. మలయాళ చిత్ర పరిశ్రమను కూడా కలుపుకోవటం తెలిసిందే.

బాహుబలి, శ్రీమంతుడు


 తాజాగా తెలుగుకు సంబంధించి రెండు చిత్రాలు పెద్ద ఎత్తున వివిద విభాగాల్లో నామినేట్ కావటం విశేషం.  దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన బాహుబలి సినిమా ఐఫా ఉత్సవంలో మొత్తం 14 క్యాటగిరీలలో నామినేషన్లు సొంతం చేసు కోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ శ్రీమంతుడు మూవీ 11 క్యాటగిరీలలో నామినేషన్లను సొంతం చేసుకుంది. డిసెబర్ 6 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని గచ్చీబౌ లి స్టేడియంలో జరిగే ఈ వేడుకలో సౌతిండియన్ సినీ పరిశ్ర మలకు చెందిన పలువురు టాప్‌స్టార్స్ హాజరుకానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: