సూపర్ స్టార్ మహేష్ ని టచ్ చేసే హీరో లేడనేది వాస్తవమంటే నమ్మాలి ఎందుకంటే రెండు వరుస ఫ్లాపులు వచ్చిన తర్వాత వచ్చిన శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఆ ఫామ్ని అలానే కొనసాగించేలా చూస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనడంలో సందేహం లేదు. అయితే సినిమా బడ్జెట్ ప్రి రిలీజ్ బిజినెస్ తలపిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ దక్కించుకున్నదని న్యూస్.


శ్రీమంతుడు సినిమా జీ తెలుగు సొంతం చేసుకోగా.. ఈ సినిమాను కూడా అదే చానెల్ వారు దక్కించుకుని ఉంటారని టాక్. కాని పెద్ద మొత్తంలో బ్రహ్మోత్సవం అమ్ముడయినట్టు సమాచారం. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా 20 కోట్ల దాకా శాటిలైట్ పలికిందని అంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ఇంత రేటు పలికిందంటే సినిమా భారీ మొత్తాన్నే కలక్షన్స్ గా సంపాధించే అవకాశం ఉంది. సినిమాకు పెద్ద ప్లస్ అయ్యే యాస్పెక్ట్ ఏంటంటే సినిమా కుటుంబ కథ కావడం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ఓవర్సీస్ లో భారీ కలక్షన్స్ సాధించిన మహేష్ ఈ సినిమాతో కూడా అక్కడ మరో రికార్డుని సొంతం చేసుకుంటాడని అంటున్నారు.


శ్రీమంతుడు సినిమాలో మహేష్ :


శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పివిపి బ్యానర్లో పరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ముగ్గురితో రొమాన్స్ చేయడం విశేషం. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద సినిమాల తర్వాత వస్తున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను కూడా చక్కగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా కుటుంబమంతా కూర్చుని చూసే విధంగా సినిమాలను తీస్తూ సూపర్ సక్సెస్ అవుతున్నాడు దర్శకుడు శ్రీకాంత్.
మరి సినిమా ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు.. ఒకవేళ అది కూడా స్టార్ట్ అయితే సినిమా శాటిలైట్ రైట్స్ కన్నా భారీగా వెళ్లే చాన్సెస్ ఉన్నాయ్. ప్రి రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్లో జరిగి సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: