ఓ సినిమా హిట్ అయితే అది నా వల్లే అని ప్రతి ఒక్కరూ అంతర్ముఖంగా మాట్లాడుకుంటారు. ఇక దర్శకుడు, రచయితలు అయితే ఆ సక్సెస్ లో కీలక భాగం ఎవరికివారే తమదిగా ఫీల్ అవుతుంటారు. అయితే వీరంతా ఎటువంటి ఫీలింగ్స్ లో ఉన్నప్పటికీ, పైకి మాత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు. అయితే అదే మూవీ ప్లాప్ అయితే? ఎక్కువ భాగం ఎవరిది తప్పు అనేది చిత్ర యూనిట్ అంతా ఫిల్టర్ చేసి ఓ వ్యక్తిని కార్నర్ చేస్తుంది.


ఇప్పుడు బ్రూస్ లీ మూవీ ప్లాప్ కి సంబంధించిన విషయంలోనూ అదే జరుగింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్లాప్ పై స్టార్ రైటర్ కోనవెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, దర్శకుడు శ్రీనువైట్ల, కోన వెంకట్‌ల కాంబినేషన్‌లో పలు హిట్ మూవీలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీకి పలు బ్లాక్‍బస్టర్ సినిమాలను అందించారు.అయితే ‘బాద్‌షా’ సమయంలో ఇద్దరి మధ్య వచ్చిన బేధాభిప్రాయాలు, ఇప్పటి వరకూ  అంతకు అంతకు పెరుగుతూ వస్తున్నాయి తప్పితే ఎక్కడా తగ్గే ఛాన్స్ కనిపించటం లేదు. 


దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రూస్ లీబాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది. సినిమాలో ఎక్కడా కొత్తదనం లేకపోవటంతో ప్రేక్షకుల నుంచి కూడా ఈ మూవీ రిజెక్ట్ అయింది. ఇక ఈ మూవీపై స్టార్ రైటర్ కోన కొన్ని షాకింగ్ ఫ్యాట్స్ ని చెప్పుకొచ్చాడు. శంకరాభరణంమూవీ ప్రమోషన్ లో భాగంగా కోనవెంకట్ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్ఛర్యపరిచాయి. “‘బ్రూస్ లీ’ సినిమాకు నేను72 సన్నివేశాలిస్తే, శ్రీనువైట్ల అందులో కొన్నిమాత్రమే వాడుకున్నాడు.


అయితే కథ నా పేరు మీదే ఉంది కాబట్టి బ్రూస్ లీ నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఒక దర్శకుడిగా శ్రీనువైట్ల ఎటువంటి సన్నివేశాలను వాడుకోవాలి అనుకున్నది అతడిష్టం. అయితే నేను రాసిన సన్నివేశాలు ఉండి ఉంటే బ్రూస్ లీ ఇంకోలా ఉండేది అనిపిస్తోంది. శంకరాభరణంతో మళ్ళీ ఆ డ్యామేజ్‌ను పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నా” అన్నారు. ఇంత చెప్పి “మా ఇద్దరి బంధం ఇప్పుడు వెంటిలేషన్‌పై ఉంది. సో, ఏదైనా జరగొచ్చు” అన్నట్టుగా శ్రీనువైట్ల పై చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: