ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ టాప్ హీరోల పై అసహనం వ్యక్త పరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. టాప్ హీరోల సినిమాలతో వెలుగులోకి వచ్చిన కోన వెంకట్ అదే టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోన వెంకట్ ఈ కామెంట్స్ చేసాడు. 

తాను రెగ్యులర్ ఫార్మెట్ సినిమాలతో విసుకు చెందిపోయానని భవిష్యత్ లో తాను టాప్ హీరోల సినిమాలకు స్క్రిప్ట్ ఇవ్వనని అంటూ కామెంట్స్ చేసాడు కోన. తాను టాప్ హీరోలకు ఇచ్చిన కథలలోని సీన్స్ మారిపోయి ఆ సినిమాలు పరాజయం చెందితే తనను టార్గెట్ చేస్తున్నారని అంటూ ఈ కారణం వల్ల తాను టాప్ హీరోల సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లుగా కామెంట్స్ చేసాడు. 

‘బ్రూస్ లీ’ సినిమాకు తాను రాసిచ్చిన 27 సీన్స్ ఆ సినిమాలో మిస్ అయ్యాయి అని అంటూ ఈ విషయం తాను ఇప్పటి వరకు చరణకు కూడ చెప్పలేదని ఒకరి పై నేరాలు చెప్పడం తనకు ఇష్టం లేదు అంటూ కామెంట్స్ చేసాడు కోన. ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఒక టాప్ హీరో ఒక రచయిత చెప్పిన కథను ఓకె చెప్పే ముందు దాదాపు 100 మంది వింటారని వారందరికీ నచ్చాక మాత్రమే ఒక రచయిత చెప్పిన కథకు టాప్ హీరో ఓకె చెప్పడం జరుగుతుందని ఈ పరిస్థుతుల నేపధ్యంలో సినిమా పరాజయానికి రచయితకు ఎంత వరకు బాధ్యత ఉంటుంది అని చెప్పుకొచ్చాడు కోనవెంకట్.

ప్రస్తుతం తాను నిర్మిస్తున్న ‘శంకరాభరణం’ విడుదల అయ్యాక వీలైనంత వరకు టాప్ హీరోల సినిమాలకు దూరంగా ఉంటానని అయితే అలాంటి పరిస్థుతులలో కూడ తాను టాప్ హీరోల సినిమాలకు పనిచేయవలసి వస్తే ఆ సినిమా నిర్మాణంలో కూడ తనకు బాధ్యతను ఇచ్చినప్పుడు మాత్రమే టాప్ హీరోలకు కథలు రాస్తాను అని అంటున్నాడు కోనవెంకట్. ‘శంకరాభరణం’ విడుదల తరువాత భాగ్యనగరంలో రోజురోజుకు పెరిగి పోతున్న డ్రగ్ మాఫియా పై ఒక వెరైటీ థ్రిల్లర్ తీయబోతున్నాను అంటూ కోన వెంకట్ టాప్ హీరోల పై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: