సినిమా పరిశ్రమలో దర్శకుడు అసిస్టెంట్ లను పెట్టే చిత్రవదల గురించి అందరికి తెలిసిందే అయినా రీసెంట్ గా ఓ దర్శకుడి ప్రవర్తన నచ్చక చిత్రానికి పనిచేస్తున్న డైరెక్షన్ డిపార్ట్ మెంట్ మొత్తం అతని మీద స్ట్రైక్ కి దిగడం జరిగిందట. సినిమా దర్శకుల దగ్గర పనిచేసే అసిస్టెంట్ లను పని వాళ్లలా ట్రీట్ చేయడం డైరక్టర్ల ఆనవాయితీగా అనే పరిస్థితులు ఉన్నా గొప్ప దర్శకులు దీన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే అటు స్టార్ డైరక్టర్ కి పనికిరాని ఇటు చిన్న దర్శకుడు అనిపించుకోని ఓ దర్శకుడు పెడుతున్న చిత్రవదకు ఆ దర్శకుడి దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్లంతా ఆ దర్శకుడిపై వాగ్వివాదానికి దిగడం జరిగిందట.


సినిమా అనేది దర్శకుడి క్రియేటివిటీయే అయినా దానికి పనిచేసే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటేనే ఆ దర్శకుడు అనుకున్న అవుట్ పుట్ తెర మీదకు తీసుకురాగలుగుతాడు. ఇది తెలిసినా అలా ప్రవర్తిస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కాని సదరు దర్శకుడి మీద అతని డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడంటే సమాజం మీద గౌరవంతో ఉండాలి, తన దగ్గర పనిచేసే టీంతో ముందు సన్నిహితంగా ఉండాలి కాని ఈ దర్శకుడు తానేదో గొప్ప డైరక్టర్ అన్నట్టు ఫీల్ అవుతూ తన దగ్గర పనిచేస్తున్న వారిని బూతులతో తిడుతూ పనిచేయించుకుంటున్నాడట.


కామెడీ హీరో చేసిన సినిమాతో పరిచయమైన ఈ దర్శకుడు రాక రాక స్టార్ హీరో సినిమా వస్తే అది కాస్త ఫ్లాప్ చేసి ఆ హీరోకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అయితే హీరో పబ్లిక్ గా నా ఇన్నేళ సిని ప్రయాణంలో ఆ సినిమా చేయడం అంత తప్పు పని ఇంకోటి లేదని ఇండైరెక్ట్ గా డైరెక్టర్ కి షంటింగ్ ఇచ్చాడు. మరి అప్పుడైనా మార్పు పొందని దర్శకుడు ఇప్పుడు ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ ఆర్టిస్ట్ కొడుకు హీరోగా చేస్తున్న సినిమాలో షూటింగ్ ని గొడవల పాలు చేసుకుంటున్నాడట. దర్శకుడు ఎంత తోపు అని ఫీల్ అయినా డైరక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా ఒక్క సీన్ చేయలేడు అనేది నిజం.. మరి పరిశ్రమతో కలుపుకోలుగా ఉంటే నాలుగు సినిమాలు చేసుకుంటూ నలుగురి మధ్యన ఉంటాడు.. లేదు నేను ఇలానే ఉంటాను అని అంటే ఇదే ఆ దర్శకుడి చివరి సినిమా అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 


అయితే ఆయన ఏమై పోయినా పర్వాలేదు కాని ప్రస్తుతం చేస్తున్న నిర్మాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిందని టాక్. సినిమా మీద ఫ్యాషన్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఆ సినిమాకు పనిచేస్తున్న దర్శకత్వ శాఖలో వచ్చిన ఈ గొడవల వల్ల సినిమా నిర్మాత ఏంతో లాస్ అయ్యే చాన్స్ ఉంది. అసలు సినిమా షూటింగ్ సజావుగా సాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. మరి భద్రం కరువైన ఆ నిర్మాత పరిస్థితి ఏంటో ఆయనకే తెలియాలి. దర్సకులుగా మారిన ప్రతి ఒక్క అసిస్టెంట్.. అసిస్టెంట్ లను మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్క దర్శకుడు ఈ దర్శకుడి చేసిన పొరపాట్లు చేయకుండా ఉంటే బెటర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: